సిక్కులపై పెరుగుతున్న విద్వేష దాడులు .. న్యూయార్క్ మేయర్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవలి కాలంలో అమెరికాలో సిక్కులపై( USA Sikhs ) మళ్లీ విద్వేషదాడులు పెరుగుతూ వుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యూయార్క్ సిటీ బస్సులో గత వారం 19 ఏళ్ల సిక్కు సంతతి యువకుడిపై ఓ దుండగుడు దాడి చేయడంతో పాటు అతని తలపాగా ( Turban ) లాగేందుకు యత్నించాడు.

ఈ ఘటనను మరిచిపోకముందే అదే న్యూయార్క్ నగరంలో సిక్కు సంతతికి చెందిన వృద్ధుడిని ఓ అగంతకుడు కొట్టి కొట్టి చంపాడు.వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో వున్న సిక్కులు( Sikhs ) తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్( New York City Mayor Eric Adams ) సంచలన వ్యాఖ్యలు చేశారు.సిక్కులు ధరించే తలపాగా అంటే ఉగ్రవాదం కాదని.

విశ్వాసానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.ఇటీవల జరుగుతున్న దాడులను మేయర్ దేశంపై మచ్చగా అభివర్ణించారు.

Advertisement

సిక్కు మతం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా ఆడమ్స్ పిలుపునిచ్చారు.

సిక్కులంటే టెర్రరిస్టులు కాదని. ఈ నగరం, ఇక్కడి యువత, మన పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు.సౌత్ రిచ్‌మండ్ హిల్‌ క్వీన్స్ పరిసరాల్లో బాబా మఖాన్ షా లుబానా సిక్కు సెంటర్‌లో( Baba Makhan Shah Lubana Sikh Center ) సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ఎరిక్ ఆడమ్స్ ఈ వ్యాఖ్యలు చేశారు .జస్మర్ సింగ్‌పై ( Jasmer Singh ) జరిగిన దాడిని హింసాత్మక తెలివి తక్కువ చర్యగా అభివర్ణించిన ఆడమ్స్.ఆయన ఎప్పటికీ మనతోనే వుంటారని చెప్పారు.

ఇమ్మిగ్రేషన్ అటార్నీగా వున్న తన కొడుకును చూస్తూ వుండాలని మేయర్ ఆకాంక్షించారు.న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ వుమెన్ జెన్నీఫర్ రాజ్‌కుమార్( Jenifer Rajkumar ) మాట్లాడుతూ.

సిక్కులను సమాజానికి రక్షకులుగా అభివర్ణించారు.వారిని ద్వేషపూరిత చర్యలకు లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

అటువంటి హింసకు పాల్పడిన వారిపై చట్టపరంగా పూర్తి స్థాయిలో విచారించబడతారని జెన్నీఫర్ చెప్పారు.

Advertisement

మరోవైపు.సిక్కులపై పెరుగుతున్న దాడులను న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ నగర మేయర్, సిక్కు సంతతికి చెందిన రవి భల్లా( Ravi Bhalla ) ఖండించారు.ద్వేషం, హింస అనేవి ఖండించదగిన చర్యలని.

ఇవి ఐక్యత, వైవిధ్యం, అంగీకారంతో కూడిన అమెరికన్ విలువల గుండెపై దాడి చేస్తాయని రవి భల్లా వ్యాఖ్యానించారు.ఈ పరిస్థితుల్లో అందరూ ఒక్కటై స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఒక ప్రభుత్వ అధికారిగా, హోబోకెన్ మేయర్‌గా. ద్వేషం, అసహనం, వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తుతానని, చర్యలు తీసుకుంటానని రవి ఎస్ భల్లా ప్రతిజ్ఞ చేశారు.

వైవిధ్యమే మా బలం అని గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు