కలిసి వస్తున్న కాంగ్రెస్ వ్యూహాలు ! మద్దతిచ్చిన మరో పార్టీ 

తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది.రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ( BRS )పై సహజంగా పెరిగిన ప్రజా వ్యతిరేకత తో పాటు,  బిజెపిలో కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతుండడం ఇవన్నీ ఆ పార్టీకి కలిసి వస్తున్నాయి.

 Congress Strategies Coming Together! Another Supported Party , Telangana Con-TeluguStop.com

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఇతర పార్టీలు చోటుచేసుకుంటున్న పరిణామాలు కలిసి రావడంతో పాటు,  ఒక్కో పార్టీ కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడుతుండడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.  తాజాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ నిర్ణయించుకుంది.

ఈ మేరకు ప్రొఫెసర్ కోదండరామ్( Professor Kodandaram ) తో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంతనాలు చేశారు.

Telugu Congress, Kodandaram, Telangana, Tjs-Politics

బిఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చేయడమే ఉమ్మడి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు పరస్పరం సహకరించుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు.ఓట్లు, సీట్ల సర్దుబాటుకు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనలో టీజేఎస్ కు తగిన భాగస్వామ్యం కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలు పై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో వాటికి అదనంగా ఆరు అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోదండరాం కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , ప్రజా పరిపాలన కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా కోదండరాం తెలిపారు.

Telugu Congress, Kodandaram, Telangana, Tjs-Politics

కొత్త ప్రభుత్వంలో పరిపాలనలో తగిన భాగస్వామ్యం కల్పించేందుకు కాంగ్రెస్ తో ఒప్పందం కుదిరిందని,  విద్య వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని,  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని,  రైతులకు తగిన సహాయ సహకారాలు లభించాలని,  పాలనలో ఎస్సీ , ఎస్టీ,  బీసీ మైనారిటీలకు భాగస్వామ్యాన్ని ఇవ్వాలని తెలంగాణ పునర్ నిర్మాణం కోసం టీజేఎస్ , కాంగ్రెస్ మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు కావాలని కోదండరాం సూచించారు .వీటిపై రేవంత్ రెడ్డి ( Revanth Reddy )సానుకూలంగా స్పందించడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్ , బిజెపిలను ( BRS BJP )వ్యతిరేకిస్తున్న వ్యక్తులను,  పార్టీలను దగ్గర చేసుకునే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు ఆ పార్టీకి బాగా కలిసి వస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube