పాత బ‌ట్ట‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న యువ‌తి... ! నాడు తిండికి క‌రువు.. నేడు ల‌క్షాధికారి !

బండ్లు ఓడ‌లు.ఓడ‌లు బండ్లు అవుతాయ‌నే నానుడి మ‌న‌కు తెలుసు.

జీవితంలో కూడా అప్పుడ‌ప్పుడు అనుకోని విచిత్రాలు సంభ‌విస్తుంటాయి.ముండ్ల దారి అయినా ఎదురెళ్తే అనంత‌రం పూల‌బాట స్వాగ‌తిస్తుంద‌ని కూడా వినే ఉంటాం.

మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు, ఆలోచ‌న‌లు అప్పుడ‌ప్పుడు మ‌న‌ల్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దుతాయి.ల‌క్కీ లాట‌రీ కొన్న‌ప్పుడో.

ఇత‌ర సంద‌ర్బాల్లో చాలా మంది రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయిన‌వారు ఉన్నారు.ఇదంత ప‌క్క‌న పెడితే క‌ష్ట‌ ప‌డుతూ పైకొచ్చిన వారు కూడా ఉన్నారు.

Advertisement

ఇందుకు తీసుకునే ఆలోచ‌న‌లే మార్గ నిర్ధేశం చేస్తాయి.దుర్భ‌ర జీవితం నుంచి హూందాగా జీవించేలా చేస్తాయి.

కానీ, ఓయువ‌తి తీసుకున్న నిర్ణ‌యం ఆమెను ల‌క్ష‌లు గ‌డించేలా చేసింది.మిర్ర‌ర్ నివేదిక ప్రకారం.

యునైటెడ్ కింగ్‌ డ‌మ్‌లో నివ‌సిస్తున్నహోలీమేరీ అనే యువ‌తి డ‌బ్బు సంపాదించాల‌నుకుంది.ఇందుకు ఓ వినూత్న మార్గాన్ని ఆమె ఎంచు కుంది.

ఇదే యువ‌తి జీవితాన్ని మొత్తం మార్చేసింది.ప‌ద్దెనిమిదేండ్లు ఉన్న హోలీ మేరీ ఒక స్టూడెంట్‌.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్ర‌స్తుతం స‌ద‌రు యువ‌తి పాత దుస్తులు అమ్ముతూ ల‌క్ష‌లు గ‌డిస్తోంది.అయితే ఆమె మొద‌ట్లో లావుగా ఉండ‌డంతో బ‌రువు త‌గ్గేందుకు అనే ప్ర‌య‌త్నాలు చేయ‌గా 2015-16లో బ‌రువు త‌గ్గింది.

Advertisement

అప్ప‌టి వ‌ర‌కు ఆమె ఉప‌యోగించిన దుస్తులు వ‌దులుగా మారాయి.దీంతో ఆమె వాటిని ప‌క్క‌న పెట్టేసింది.

అనుకోకుండా ఒక‌రోజు ఆమెకు ఒక ఆలోచ‌న త‌ట్టింది.వెంట‌నే పాత‌ బ‌ట్ట‌ల‌ను అమ్మేందుకు నిర్ణ‌యించు కుంది.వెంట‌నే మోలీ అప్లికేష‌న్ ద్వారా పాత దుస్తులు అమ్మ‌డం ప్రారంభించింది.

త‌ద్వారా ఆమెకు పాకెట్ మ‌నీకి స‌రిపోయే డ‌బ్బు రాగా త‌న అవ‌స‌రాలు తీర్చుకునేది.ఇలా త‌న అమ్మ‌కాల‌ను విస్తృతం చేసుకున్నాక 2018లో హోలీ బ్రాండెడ్ దుస్తులు అమ్మ‌డం మొద‌లెట్టింది.అంత‌టితో ఆగ‌ కుండా డిజైనర్ దుస్తులు, ఆభ‌ర‌ణాలు కూడా అమ్మ‌డం విశేషం.2021 నాటికి హోలీ డిమాండ్ అమాంతంగా పెరిగింది.గ‌తేడాది జూన్ నుంచి పూర్తిస్థాయి వ్యాపారం చేప‌డుతోంది.

ఇలా అంచ‌లంచ‌లు ఎదుగుతూ సొంతంగా షాపులు కూడా తెరిచింది.పురుషుల దుస్తులతో పాటు సెకండ్ హ్యాండ్ దుస్తుల అమ్మ‌కాలు చేప‌డుతోంది.గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో దుబాయ్ వెళ్లిన ఆమె తిరిగి బ్రిట‌న్‌కు తిరిగి వెళ్ల‌లేదు.

అక్క‌డే వ్యాపార లావాదేవీలు కొన‌సాగిస్తున్న‌ది.ప్ర‌జెంట్ ఆమె ఇండోనేషియాలోని బాలిలో ఉంటోంది.

అక్క‌డి నుంచే వ్యాపారాన్ని న‌డిపిస్తోంది.లాయ‌ర్ కావాల‌నే సంక‌ల్పంతోపాటు త‌న వ్యాపారాన్ని విస్త‌రించాల‌ను కోంటోంది.

డీపాప్ యాప్ ద్వారా సెకండ్ హ్యాండ్ దుస్తులు విక్ర‌యించాల‌ను కుంటోంది.ఇందుకు ఆన్‌లైన్ మాధ్య‌మాన్ని ఎంచుకుంది.

అందు కేనేమో కృషితో నాస్థి దుర్భిక్షం అంటారు.

తాజా వార్తలు