ఆ సినిమాలో కృష్ణుని పాత్రలో కనిపించనున్న యంగ్ టైగర్.. ఫ్యాన్స్ కు పండగ అనేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( NTR )వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన బృందావనం ( Brindavanam )సినిమాలో కొన్ని సెకన్ల పాటు కృష్ణుని రోల్ లో కనిపించగా తారక్ అలా కనిపించడం ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.తారక్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో వార్2 ఒకటి కాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్, తారక్ మొదట స్నేహితులుగా ఉంటారని తర్వాత శత్రువులుగా మారతారని తెలుస్తోంది.

కృష్ణార్జునుల పాత్రలను రెఫరెన్స్ గా తీసుకుని కృష్ణుడి పాత్రను పోలి ఉండేలా తారక్ రోల్ ను, అర్జునుడి పాత్రను పోలి ఉండేలా హృతిక్ రోల్ ను ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది.ఫ్యాన్స్ కు పండగ అనే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.వార్2 సినిమాలో తారక్ రోల్ ఒకింత నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వార్2 సినిమా రిలీజయ్యేది 2025లోనే అని సమాచారం.

2024లో దేవర సినిమా( Devara )తో ప్రేక్షకుల ముందుకు రానున్న తారక్ 2025 సంవత్సరంలో మాత్రం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తారక్ తన సినిమాల షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.వరుసగా మూడు ప్రాజెక్ట్ లను తారక్ ప్రకటించగా ఈ సినిమాలను కొన్ని నెలల గ్యాప్ లో తారక్ థియేటర్లలో విడుదల చేస్తుండటం గమనార్హం.

తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ కు అనుగుణంగా జరిగేలా తారక్ ప్లాన్ చేస్తున్నారని సినిమాలకు సంబంధించి తన వైపు నుంచి ఏ పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తారక్ తన సినిమాలలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు