చిరంజీవి దారిలో నడుస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అలాంటి రిస్క్ చేస్తారా?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలవడానికి ఆ సినిమాలో కొరటాల మార్క్ సన్నివేశాలు లేకపోవడం కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్30 సినిమాలో తారక్ కొంత సమయం పాటు జాలరిగా కూడా కనిపిస్తారని సమాచారం అందుతోంది.వాల్తేరు వీరయ్యలో చిరంజీవి పాత్ర ఏ విధంగా ఉంటుందో ఎన్టీఆర్30 లో తారక్ పాత్ర అదే విధంగా ఉంటుందని ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

సముద్ర జలాల గురించి కూడా ఈ సినిమాలో చర్చ ఉంటుందని సమాచారం అందుతోంది.తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుండగా మేకర్స్ మాత్రం ఆమె పేరును ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

అదే సమయంలో తారక్ కు జోడీగా ఈ మధ్య కాలంలో రష్మిక పేరు కూడా వినిపిస్తోంది.పుష్ప2 మినహా రష్మిక చేతిలో భారీ ప్రాజెక్ట్ లేవీ లేకపోవడంతో రష్మిక కూడా ఈ సినిమాలో నటించడానికి నో చెప్పే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ను మరింత పెంచేలా తర్వాత ప్రాజెక్ట్ లు ఉండాలని భావిస్తుండటం గమనార్హం.

Advertisement

ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది మొదలుకానుందని సమాచారం అందుతోంది.ఈ ఏడాది తారక్ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.అయితే వచ్చే ఏడాది నుంచి ఏడాదికో సినిమాతో తారక్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

తారక్ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆచితూచి అడుగులేస్తున్నారని 70 నుంచి 120 కోట్ల రూపాయల స్థాయిలో ప్రస్తుతం తారక్ రెమ్యునరేషన్ ఉందని తెలుస్తోంది.కొరటాల శివ సినిమాకు తారక్ పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు