'మైఖేల్' మూవీ మీదనే భారి అంచనాలు పెట్టుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్

మన టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తానం మూవీ తో మొదలైన హీరో సందీప్ కిషన్ సినీ కెరీర్ ఆ తరువాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు , ఈ క్రమంలో సందీప్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యాయి , మరికొన్ని యావేరేజ్ గా నిలిచాయి .

 Young Hero Sundeep Kishan Huge Expectations On Michael Movie Details, Sandeep Ki-TeluguStop.com

వైవిధ్యమైన సినిమాలు చెయ్యాలను కోరుకునే వారిలో హీరో సందీప్ కిషన్ ఎప్పుడు ముందుంటారు .రొటీన్ సినిమాలే కాకుండా సినిమాలో ఎదో కొత్తదనం ఉండాలి అని ఎప్పుడు భావిస్తుంటారు.మంచి హైట్ ,భారి కటౌట్ , చక్కని స్మైల్ ,ఆరు అడుగుల ఎత్తు, హీరో గా ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నా ఒక్క సరైన సాలిడ్ హిట్ తన ఖాతాలో లేదు.

అప్ కమింగ్ డైరెక్టర్స్ దగ్గర నుండి సీనియర్ డైరెక్టర్స్ తో ఎన్ని మూవీస్ లో నటించిన అవి కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం దక్కేవి కావు.

సందీప్ హీరోగా చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినప్పటికీ ,తాను చేయబోయే తరువాత సినిమా అయిన హిట్ అవుతుంది అన్న నమ్మకంతో ఫుల్ స్పోర్టివ్ గా ఉండేవాడు ,ఇక తన సినిమాను చాలా స్పెషల్ గా ప్రోమోట్ చేసుకునేవాడు ,హీరోగా ఒక పక్క సినిమాలు చేస్తూనే,మరో పక్క నిర్మాత గా యు టర్న్ తీసుకొని “నిను వీడని నీడని నేనే , ఎ1 ఎక్స్‌ప్రెస్, వివాహ భోజనంబు వంటి సినిమాలను నిర్మించాడు .ఇక అసలు విషయానికి వస్తే.2021 లో డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి-హీరో సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ మూవీ గల్లీ రౌడీ,

Telugu Sandeep Kishan, Michael, Sundeepkishan, Youngsundeep-Movie

ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ ,తో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయింది.సినిమా లో దమ్ము ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అయ్యేదే , ఇక ఈ మూవీ ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది .ఇక గల్లీ రౌడీ మూవీ తరువాత హీరో సందీప్ కిషన్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని పాన్ ఇండియా మూవీ గా మైఖేల్ సినిమాలో నటిస్తున్నాడు .ఈ మూవీని డైరెక్టర్ రంజిత్ జయకోడి సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.ఇక రీసెంట్ గా ఈ మోవికి సంబంధించి రిలీజ్ చేసిన టైటెల్ టీజేర్, మరియు లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల్లో అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది .ఇక యువ హీరోస్ అడవి శేష్ ,విస్వక్ సేన్ ,యంగ్ హీరో నికిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు ,

Telugu Sandeep Kishan, Michael, Sundeepkishan, Youngsundeep-Movie

ఈ రేస్ లో హీరో సందీప్ కిషన్ చాల వేనుకపడిపోయాడు, రెగ్యులర్ సినిమాలు కాకుండా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఎ 1 ఎక్స్ ప్రెస్ మూవీ కుడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించనంత స్థాయి లో విజయం అందుకోలేదు.ఇక గల్లీ రౌడీ మూవీ తరువాత సందీప్ కిషన్ చేయబోతున్న మైఖేల్ సినిమా మీద భారి అంచనాలు ఉన్నాయి .ఇక ఈ మూవీ క్యాస్టింగ్ విషయానికి వస్తే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ఈ మూవీ లో విజయ్ సేతుపతి యాక్షన్ రోల్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది .అలానే క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్‌గా నటించారు.మైఖేల్ మూవీ టీజర్ , లిరికల్ సాంగ్ తప్పితే ఈ మూవీ నుండి ఒక్క అప్ డేట్ కుడా రాలేదు ,ఇక తాజగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మూవీ యూనిట్ నుండి అప్ డేట్ వచ్చింది.ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నట్ల మూవీ యూనిట్ తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube