వైరల్ వీడియో: పిచ్ పైనే ప్రాణాలు వదిలిన యువ క్రికెటర్..!

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక హృదయ వికారమైన సంఘటన చోటు చేసుకుంది.జిన్నూరు నగరంలో లోకల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.

అయితే నిన్న ఓ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఒక బ్యాట్స్ మ్యాన్ ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.దీంతో అక్కడే ఉన్న అంపైర్ వెంటనే ఇతర ఆటగాళ్లను పిలిచి ఏమైందో చూడాలని కోరాడు.

అయితే ఆటగాళ్ళందరూ కింద పడిపోయిన బ్యాట్స్ మ్యాన్ ని లేపడానికి ఎంతో ప్రయత్నించారు కానీ అతనిలో ఎటువంటి చలనం కనిపించలేదు.దీంతో ఆటగాళ్లు ఆ బ్యాట్స్ మ్యాన్ ని లోకల్ ఆసుపత్రి కి తరలించారు.

దీనితో అక్కడి వైద్యులు పరీక్షించి అతను గుండెపోటుతో చనిపోయాడు అని నిర్ధారించారు.దీంతో తోటి ఆటగాళ్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

అతడి మరణం తో జిన్నూరు సిటీ లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

అయితే చనిపోయిన బ్యాట్స్ మ్యాన్ ని బాబు నల్వాడే గా గుర్తించారు.ఈ ఆటగాడు చనిపోయే ముందు అంపైర్ తో మాట్లాడుతూ ఇంకా ఎన్ని బంతులు మిగిలి ఉన్నాయి? అని కూడా అడిగాడు.అలాగే తన బ్యాటింగ్ పార్టనర్ తో కూడా మాట్లాడాడు.

కానీ క్షణాల వ్యవధిలోనే అతనికి కళ్ళు తిరగడం బ్యాట్ పట్టుకొని మోకాళ్ళపై కూర్చోవడం ఆపై కింద పడిపోవడం చకచకా జరిగిపోయాయి.ఐతే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట దర్శనమిచ్చింది.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.మహారాష్ట్రంలో జనవరి 18వ తేదీన రామన్ గైక్వాడ్ అనే మరొక క్రికెట్ ఆటగాడు కూడా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?

బలహీనమైన గుండె గల చాలామంది ప్లేయర్లు క్రికెట్, ఫుట్ బాల్ వంటి ఆటలు ఆడుతున్న సమయంలో గుండెపోటుతో మరణించారు.గుండె పై తీవ్ర ఒత్తిడి పెరగడం కారణంగానే ఇలా జరుగుతుందని చెబుతుంటారు.

Advertisement

ఏది ఏమైనా ఆటగాళ్లు తమ ఆరోగ్యం బాగుంటేనే ఆటల్లో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు