సినీ హీరోలు రాజకీయాల్లో రావడం కొత్తేమి కాదు.కానీ వచ్చిన ప్రతీ ఒక్కరు సక్సెస్ కాలేకపోయారు.
ఆరోజుల్లో రాజకీయ పార్టీలు తక్కువ, కేవలం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ఉండేవి.అలాంటి సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీఆర్( SR NTR ), తమిళనాడు లో ఎంజీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి సొంతగా పార్టీలు స్థాపించి ముఖ్యమంత్రులు అయ్యారు.
కానీ నేడు ఆ పరిస్థితి లేదు.సినిమాల్లో ఎన్టీఆర్ స్థాయి ప్రజాధారణ పొందిన మెగాస్టార్ చిరంజీవి 2009 వ సంవత్సరం లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేసి 18 స్థానాలను గెలుచుకున్నాడు.కానీ ఆయన తిరుపతి మరియు పాలకొల్లు లో పోటీ చెయ్యగా, పాలకొల్లు స్థానం లో ఓడిపోయాడు.
కానీ వోట్ షేర్ మాత్రం 18 శాతం కి పైగానే వచ్చింది.ప్రజారాజ్యం పార్టీ ని అలాగే ఉంచొని ఉండుంటే 2014 ఎన్నికలలో ముఖ్యమంత్రి అయ్యేవాడు.

కానీ రాజకీయ ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక ఆయన ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో కలిపేసాడు.ఇక ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేటి తరం హీరోలలో నెంబర్ 1 అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈయన కూడా జనసేన పార్టీ( Janasena party ) స్థాపించి 2019 ఎన్నికలలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు.పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిని చూడాల్సి వచ్చింది.
కానీ ఆయన రాజకీయాల్లోనే ఉంటూ నేడు పార్టీ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసాడు.భవిష్యత్తులో అన్నీ అనుకూలిస్తే ముఖ్యమంత్రి అవ్వొచ్చు కూడా.ఇక లేటెస్ట్ గా తమిళ హీరో విజయ్( Vijay ) కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని పరోక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇందుకోసం అభిమాన సంఘాలతో ఆయన పలుమార్లు రహశ్యంగా భేటీ కూడా అయ్యాడు.
రాజకీయ పార్టీ ని స్థాపించిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్బై చెప్పబోతున్నాని కూడా తెలిపాడు.

తమిళనాడు లో ప్రస్తుతం విజయ్ రేంజ్ రజినీకాంత్ ( Rajinikanth )రేంజ్ కంటే పెద్దది.ఆయన సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి.ఇలాంటి సమయం లో కెరీర్ ని వదిలేస్తున్నాడు అంటే కచ్చితంగా ఆయనకీ జనాలకు ఎదో చెయ్యాలనే తాపత్రయం ఉంది అనే చెప్పొచ్చు.
ఇకపోతే విజయ్ ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తే ఎన్ని సీట్స్ గెలుస్తాడు అని రీసెంట్ గా ఒక ప్రముఖ కంపెనీ సర్వే నిర్వహించింది.తమిళనాడు లో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
వీటిలో విజయ్ కి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 50 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంటున్నారు.మొదటి ఎన్నికలతోనే 50 స్థానాలు అంటే, ఆ తర్వాత జరగబొయ్యే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు తమిళనాడు రాజకీయ విశ్లేషకులు.