సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాల పాటు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించడమే కష్టం కాగా 40 ఏళ్ల వయస్సులో కూడా అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మరింత కష్టమనే సంగతి తెలిసిందే.అయితే త్రిష( Trisha ) మాత్రం లియో సినిమాలో ( LEO movie )మరింత అందంగా కనిపించి ఆకట్టుకున్నారు.
ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో కనిపించిన త్రిష ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి.

త్రిష ఎంతో కష్టపడి బరువు పెరగకుండా లుక్ విషయంలో ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నాలుగు పదుల వయస్సులో ఇంత అందమా అనేంత అందంగా ఆమె కనిపిస్తున్నారు. త్రిష >( Trisha )చేతినిండా ఆఫర్లు ఉన్నాయి.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె ఆశించిన విజయాలు దక్కకపోయినా స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ త్రిష కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
లియో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు బుకింగ్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.
లియో సినిమా సెకండాఫ్ విషయంలో లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లియో సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

లియో సినిమా( LEO movie ) సీక్వెల్ లేనట్టేనని తెలుస్తోంది.లియో సినిమా నిర్మాతలు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంతృప్తితో ఉన్నారు.లియో సినిమా విజయ్ కోరుకున్న భారీ హిట్ ను అయితే అందించలేదు.విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో ఫెయిల్ అవుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
త్రిష గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ అభినయ ప్రధాన పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.రాబోయే రోజుల్లో త్రిష >( Trisha )మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.







