మారుతి సుజుకి( Maruti Suzuki ) భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ.దాని తర్వాత భారతదేశంలో టాటా మోటార్స్( Tata Motors ) కార్లు మరింత పాపులారిటీ దక్కించుకున్నాయి.
అప్‌డేటెడ్ ఫీచర్లు, తక్కువ ధర, మంచి మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకునే అనేక మోడల్‌లను ఈ కంపెనీలు విక్రయిస్తున్నాయి.అందుకే వీటిని ఎగబడి మరీ ప్రజలు కొంటున్నారు.2023, సెప్టెంబర్‌లో ఐదు బెస్ట్ సెల్లింగ్ చీప్ కార్లలో ఈ కంపెనీలకు సంబంధించినవే ఉన్నాయి.అవేవో తెలుసుకుందాం.
• బాలెనో: ( Baleno )
మారుతి సుజుకి తయారుచేసిన బాలెనో మోడల్ ధర రూ.6.61 లక్షలు, ఇది స్లీక్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్‌తో వస్తుంది.2023, సెప్టెంబర్‌లో 18,417 బాలెనో కార్లు అమ్ముడుపోయాయి.ఈ సేల్స్ ఆ నెలలో అన్ని కార్లలో అత్యధికం.అయితే, ఇది సెప్టెంబర్ 2022లో విక్రయించిన 19,369 యూనిట్ల నుంచి కొంచెం తగ్గింది.

• వ్యాగన్ R:( Wagon R )
మారుతి సుజుకి విడుదల చేసిన మరొక బెస్ట్ సెల్లింగ్ మోడల్ వ్యాగన్ R.ఇది కాంపాక్ట్ సైజు, మంచి మైలేజీకి పేరుగాంచింది.దీనిని 2023, సెప్టెంబర్‌లో 16,250 యూనిట్లను కంపెనీ విక్రయించింది, దీని సేల్స్ 2022, సెప్టెంబర్‌లో విక్రయించిన 20,078 యూనిట్ల కంటే తగ్గింది.

• నెక్సాన్:( Nexon )
ఇది మారుతి సుజుకి ప్రత్యర్థి కంపెనీ అయిన టాటా మోటార్స్ నుండి వచ్చిన మోడల్.ఇది శక్తివంతమైన పనితీరు, స్టైలిష్ రూపాన్ని అందించే సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ.2023, సెప్టెంబర్‌లో 15,325 నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయి.విక్రయించింది, ఇది గతేడాది సెప్టెంబర్ నెలలో అమ్మిన 14,518 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంది.

• బ్రెజా:( Brezza )
ఇది మారుతి సుజుకి నుంచి వచ్చిన మరొక సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ.ఇది స్పోర్టి లుక్, సౌకర్యవంతమైన క్యాబిన్‌ను కలిగి ఉంది.ఇది 2023 సెప్టెంబర్‌లో 15,001 యూనిట్లను విక్రయించింది.

• స్విఫ్ట్:( Swift )
స్విఫ్ట్ తక్కువ ధరకే లభిస్తుంది, ఎక్కువ మైలేజీని కలిగి ఉంటుంది.ఇది సెప్టెంబర్ నెలలో 14,703 యూనిట్లను విక్రయించింది, గతేడాది ఇదే నెలతో పోలిస్తే 11,988 యూనిట్ల ఈ కారులో అమ్ముడయ్యాయి.ఇది టాప్ 5 చీపెస్ట్ కార్లలో అత్యధికంగా 23 శాతం వృద్ధి రేటును కలిగి ఉంది.మొత్తం మీద , మారుతి సుజుకి సెప్టెంబరు నెలలో కార్ల మార్కెట్‌లో మొదటి ఐదు స్థానాల్లో నాలుగు మోడళ్లతో ఆధిపత్యం చెలాయించింది.
ఏదేమైనప్పటికీ, దాని కొన్ని మోడల్‌లు మునుపటి సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల్లో క్షీణతను ఎదుర్కొన్నాయి, అయితే టాటా మోటార్స్ నెక్సాన్ మరింత పాపులారిటీ పొందింది.







