ఆ డైరెక్టర్ పై ప్రేమను మాటల్లో చెప్పలేను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే నాచురల్ స్టార్ నాని ఇద్దరు కలిసి నటించిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం.

ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.వైజయంతి బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా 2015, మార్చి 21న రిలీజ్ అయి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్న విజయం తెలిసిందే.

అప్పట్లో ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించిన సందర్భంగా దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాను మళ్ళీ మూవీ మేకర్స్ రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Yevade Subramanyam 10years Celebrations, Yevade Subramanyam, Tollywood, Nagi, Co

ఇందులో భాగంగానే టీమ్ మొత్తం క‌లిసి రీయూనియ‌న్ పార్టీ చేసుకున్నారు.ఈ రీయూనియ‌న్ లో నాని, విజ‌య్, మాళ‌వికతో పాటుగా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొని ఫోటోలు దిగి సంద‌డి చేశారు.ప్ర‌స్తుతం ఆ రీయూన‌య‌న్ సంద‌ర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
Yevade Subramanyam 10years Celebrations, Yevade Subramanyam, Tollywood, Nagi, Co

ఈ సందర్భంగా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి అనుభవాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.ఆ మూవీ సమయంలో జ‌రిగిన విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ డైరెక్ట‌ర్ నాగిని విజ‌య్ కౌగిలించుకున్నారు.

Yevade Subramanyam 10years Celebrations, Yevade Subramanyam, Tollywood, Nagi, Co

త‌న‌కు నాగి అంటే ఎంత ప్రేమో మాట‌ల్లో చెప్ప‌లేనని, ఈ సినిమా త‌నకెంతో స్పెష‌ల్ అని విజ‌య్ చెప్పారు.దానికి సంబంధించి మూవీ టీమ్ ఒక వీడియోను షేర్ చేయ‌గా ఆ వీడియోను విజ‌య్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.ఈ సందర్భంగా విజయ్ చేసిన వాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే ప్రస్తుతం కింగ్ డమ్ అనే సినిమాలో నటిస్తున్నారు విజయ్.

సూపర్ స్టార్ మహేష్ ను దేవునితో పోల్చిన అన్వేష్.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు