కొబ్బరి పువ్వు ( Coconut flower )గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని చాలా మంది నమ్ముతారు.
అలాగే కొందరు కొబ్బరి పువ్వును తీసుకుని తింటుంటారు.అయితే కొబ్బరి పువ్వు రుచికరంగా ఉండటమే కాదు.
ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.కొబ్బరి పువ్వు తినడం వల్ల ఎన్ని లాభాలు చేకూరతాయో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
కొబ్బరి పువ్వు సహజ పోషక పదార్థాలతో నిండినది.న్యూట్రియంట్లు, మినరల్స్, మరియు ఫైబర్ కొబ్బరి పువ్వులో అధికంగా ఉంటాయి.
కొబ్బరి పువ్వులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.కడుపు సమస్యలు తగ్గడానికి ఉపకరిస్తుంది. మలబద్ధకం సమస్యను( Constipation problem ) దూరం చేస్తుంది.మధుమేహం ఉన్న వారికి కొబ్బరి పువ్వు సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే, కొబ్బరి పువ్వులోని సహజమైన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.అందువల్ల డయాబెటిస్( Diabetes ) ఉన్న వారు కొబ్బరి పువ్వును తీసుకోవచ్చు.

కొబ్బరి పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.అలాగే సహజంగా శరీరానికి తక్షణ శక్తిని అందించగలిగే కార్బోహైడ్రేట్లు కొబ్బరి పువ్వులో మెండుగా నిండి ఉంటాయి.శక్తిని పెంచే ఫుడ్‌గా కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది.మూత్రాశయ ఆరోగ్యానికి కూడా కొబ్బరి పువ్వు చాలా మేలు చేస్తుంది.కొబ్బరి పువ్వు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అంతేకాదండోయ్.కొబ్బరి పువ్వు హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది.మొత్తం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వెయిల్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి చిరుతిండిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇక కొబ్బరి పువ్వు చర్మానికి తేమను అందించి ప్రకాశవంతంగా మారుస్తుంది.
సహజ సౌందర్యాన్ని ప్రోత్సహిస్తుంది.కాబట్టి, కొబ్బరి పువ్వు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి.