టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ ( Puri Jagannath )కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం పూరీ జగన్నాథ్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.
ఈ డైరెక్టర్ కు కొత్త ఆఫర్లు రావడం కష్టమైంది.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.ఒక విధంగా పూరీ జగన్నాథ్ కు ఇదే చివరి ఛాన్స్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పూరీ జగన్నాథ్ చెప్పిన కథ విజయ్ సేతుపతికి నచ్చిందని తెలుస్తోంది.ఈ సినిమా పూరీ సొంత బ్యానర్ లో తెరకెక్కుతుందా లేక ఇతర బ్యానర్ లో తెరకెక్కుతుందా అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.పూరీ జగన్నాథ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.పూరీ జగన్నాథ్ భవిష్యత్తు ప్రణాళికల గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.పూరీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.

పూరీ జగన్నాథ్ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.పూరీ జగన్నాథ్ టాప్ బ్యానర్లలో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.పూరీ జగన్నాథ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.పూరీ జగన్నాథ్ కు లక్ కూడా కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతూ ఉండటం గమనార్హం.పూరీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.