175 స్థానాలు గెలవడమే వైసీపీ టార్గెట్..: సీఎం జగన్

విశాఖపట్నం( Visakhapatnam ) జిల్లాలోని భీమిలిలో ‘సిద్ధం ’ పేరిట భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

భీమిలిలో జనసంద్రం కనిపిస్తోందని సీఎం జగన్( CM Jagan ) తెలిపారు.ఈసారి ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలవడమే వైసీపీ టార్గెట్ అని చెప్పారు.చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు.

అందుకే దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తుకు వెంపర్లాడుతున్నాడని విమర్శించారు.ఈ క్రమంలోనే అటువైపు గజదొంగల ముఠా ఉందన్న సీఎం జగన్ ఇటువైపు ఉన్నది పాండవుల సైన్యమని తెలిపారు.

అలాగే పద్మవ్యూహాంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.అర్జునుడని పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలే మనకు బాణాలు, అస్త్రాలు అని చెప్పారు.2024 ఎన్నికల్లో వైసీపీ జైత్రయాత్రకు ఇది సన్నాహక సమావేశం అని స్పష్టం చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు