జగన్ అంతర్గత సర్వే.. రిపోర్ట్ ఏంటి ?

ఎన్నికల విషయంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా ఉంది.

దేశ వ్యాప్తంగా జమిలి ఎలక్షన్స్( Jamili Elections ) పై కేంద్రం దృష్టి సారించడంతో ఆయా రాష్ట్రాల ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

ముఖ్యంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా ఈసారి ఎన్నికలు ఎప్పుడొచ్చిన విజయం మాదే అని తెలుగుదేశం పార్టీ( TDP ) ధీమాగా ఉంది.అటు ప్రభుత్వ వైసీపీ కూడా విన్నింగ్ పై కాన్ఫిడెన్స్ కనబరుస్తోంది.175 స్థానాల్లోనూ విజయం గ్యారెంటీ అని చెబుతోంది.

అయితే ఆ పార్టీ అంతర్గత సర్వేలు( Internal Surveys ) మాత్రం భిన్నమైన రిపోర్ట్స్ ఇస్తున్నాయని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.దాదాపు 20 నియోజిక వర్గాలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం గ్యారెంటీ అని సర్వేలలో తేలిందట.ప్రస్తుతం ఆ నియోజిక వర్గాలల్లో ఉన్న ఎమ్మెల్యేలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ఆ సర్వేలు వెల్లడించినట్లు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి వారికే సీట్లు కేటాయిస్తే.

ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయట.అటు గత కొన్నాళ్లుగా 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై కూడా జగన్( YS Jagan ) అసంతృప్తిగా ఉన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో కనీసం 20 స్థానాల్లో ఓటమి తథ్యం అని అంతర్గత సర్వే కచ్చితంగా చెబుతుండడంతో ఆ 20 నియోజిక వర్గాలపై అధినేత స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఈసారి కొత్తవారికి సీటు ఇవ్వడంతో పాటు జనకర్షణ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారట.వైనాట్ 175 టార్గెట్ పెట్టుకోవడంతో వేసే ప్రతిఅడుగు కూడా వ్యూహాత్మకంగానే వేస్తున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి.

ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరినీ వదులుకొనని చెబుతున్న ఆయన మరి సీట్ల కేటాయింపులో ఎలాంటి ప్రణాళికలు వేస్తారో చూడాలి.ఇక ఈ ఏడాది చివర్లో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్స్ రేస్ లో ముండుండాలని జగన్ భావిస్తున్నారట.

కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయనేది అంతుచిక్కకపోవడంతో జగన్ ఏం చేస్తారో మరి.

షర్మిల పెద్ద ప్లాన్ వేశారుగా ? రేవంత్ తో సహా వీరంతా నేడు ఏపీకి 
Advertisement

తాజా వార్తలు