పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేపడుతున్న "వారాహి విజయ యాత్ర" ( Varahi Vijaya Yatra ) ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనాలు సృష్టిస్తోంది.

కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభలలో పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని.సీఎం జగన్ ని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి.

ఈ క్రమంలో పవన్ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ ప్రజా ప్రతినిధులు తమ దైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు.దీనిలో భాగంగా ఈసారి తాను కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని ఎమ్మెల్యేని కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదంటూ పవన్ చేసిన ప్రకటనపై కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి( YCP MLA Rachamallu Sivaprasad Reddy ) స్పందించారు.

పవన్ ను తాను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు.ధైర్యం ఉంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు.అంతేకాదు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా ఆపగలిగే శక్తి తనకే ఉందని సవాల్ విసిరారు.

Advertisement

ఈరోజు మధ్యాహ్నం ప్రొద్దుటూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఎక్కడ పోటీ చేసిన గెలుస్తామనే ఫేస్ వాల్యూ తనకి ఉందని పవన్ భావిస్తున్నరు.

అలాగైతే ప్రొద్దుటూరులో తనపై పోటీ చేయాలని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు.వైసీపీ అభ్యర్థిగా తాను నిలబడతానని.జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

అప్పుడు ఎవరు గెలుస్తారో.ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

పవన్ కళ్యాణ్ నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నట్లు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు