పవన్ ను తిట్టడం అంటే ఇంత సరదా ఎందుకో ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు వైసీపీ నాయకులకు చిర్రెత్తు కొస్తుంది.

ఆయన వైసీపీ ప్రభుత్వం పై అదేపనిగా విమర్శలు చేస్తుండడంతో పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుందనే భావనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

వైసీపీ పై తెలుగుదేశం పార్టీ ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా అది జనాల్లోకి బాగా వెళ్లిపోతుందనే అసహనం వైసీపీ నాయకుల్లో ఎక్కువగా ఉంది.కానీ పవన్ చేసిన చిన్న విమర్శ అయినా, పెద్ద విమర్శ అయినా జనాల్లోకి బలంగా వెళ్లిపోవడం, దాని కారణంగా ప్రభుత్వం అబాసుపాలు అవుతుండడంతో తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి గా వైసిపి నాయకులు పవన్ ను గుర్తించారు.

దీనికి తగ్గట్టుగానే పవన్ కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదేపనిగా చిన్న సమస్య, పెద్ద సమస్య, విషయం ఏదైనా జనాల్లోకి వచ్చి మరి నిలదీస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో అమరావతి రైతులు ఆందోళన చేపట్టారు.ఇది రోజు రోజుకు మరింత ఉధృతం అవుతుండడంతో పవన్ నేరుగా రంగంలోకి దిగిపోయారు.అమరావతి పరిసర ప్రాంతాల్లోని రైతులను నేరుగా కలుసుకునేందుకు ప్రయత్నించారు.

Advertisement

పవన్ పర్యటన అడ్డుకునేందుకు అడుగడుగునా పోలీసులు ప్రయత్నించడంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.పవన్ రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలపడంతో ఆయనకు మరింత మైలేజ్ తీసుకొచ్చాయి.

దీంతో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు మంత్రుల్లో తీవ్ర అసహనం కనిపించింది.ఇక ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన వారు పవన్ పై రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ విమర్శలు చేస్తూ విమర్శలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే జోగు రమేష్ పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.పవన్ పెళ్లాలను మార్చుకోవడానికి పనికొస్తాడు తప్ప రాజకీయాలకు మాత్రం పనికిరాడు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు మాకు నీతులు చెబుతున్నావా అంటూ మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక తిక్కలోడు, తిక్కలోడు గురించి మాట్లాడుకోవడం సమయం వృధా అంటూ తీసి పారేశారు.అలాగే వైసిపి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే రేంజ్ లో పవన్ పై తిట్ల దండకం మొదలుపెట్టారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
పెళ్లిళ్ల సీజన్ వచ్చింది తులం బంగారం తూచేనా ? 

పవన్ ఇప్పటివరకు సింగపూర్ లో షూటింగ్ చేశాడని, ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు.అసలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడా రాజధానిని తరలిస్తున్నామని చెప్పలేదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే జగన్ ముందుకు వెళ్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇదే రేంజ్ లో పవన్ ను ఆడిపోసుకున్నారు.పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించడం వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడటంతో పాటు ఈ సమస్య మరింత ముదురుతోంది అని అంచనాకు వచ్చిన వైసిపి నాయకులు ఈ విధంగా పవన్ ను టార్గెట్ చేసుకుంటూ తిట్ల దండకం మొదలు పెడుతూ, రాజకీయ వేడిని మరింత రాజేస్తున్నారు.

తాజా వార్తలు