తోలి బడ్జెట్ సమావేశాలకు సిద్దమౌతున్న వైసీపీ సర్కార్

ఏపీ లో కొత్త గా వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది.

ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ల ప్రమాణ స్వీకారం,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక,అలానే గవర్నర్ ప్రసంగం, ఆయన ప్రసంగానికి ధన్యవాద కార్యక్రమం వంటి పలు అంశాలపై చర్చలు నిర్వహించి సభను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అయితే తొలిసారిగా వై ఎస్ జగన్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది.ఈ సమావేశాలు నిర్వహించే తేదీలను తాజాగా ఏపీ ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం.

వచ్చే నెల అనగా జులై 11 వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

12 వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లోని ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.మొత్తంగా 15 రోజుల పాటు ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల అమలుపై దృష్టిపెట్టిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వాటి అమలుకే పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

బడ్జెట్‌ పై అన్ని శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జులై 1, 2 తేదీల్లో సమావేశం నిర్వహించనున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు