ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టి విజయం సాధించిన విషయం తెల్సిందే.నిన్న రాత్రి 11 గంటల సమయంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం లభించింది.
నేడు మండలి ముందుకు మూడు రాజధానుల బిల్లును మంత్రి బుగ్గన తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.అయితే మండలిలో టీడీపీకి ఎక్కువ సంఖ్య బలం ఉండటంతో మొదటి నుండి అనుకుంటున్నట్లుగానే అక్కడ రాజధానుల బిల్లు అడుగు పడలేదు.
అసలు బిల్లు ప్రవేశ పెట్టకుండానే తెలుగు దేశం పార్టీ రూల్ 71 ఉపయోగించుకుని ఆపేసింది.
ఒక వేళ బిల్లు పెట్టి బలం లేక వీగి పోతే వైకాపా ప్రభుత్వం ఆ బిల్లును డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద ఆమోదింపజేసుకోవచ్చు.
అందుకే తెలుగు దేశం పార్టీ మండలి నాయకుడు యనమల తెలివిగా బిల్లు ప్రవేశ పెట్టకుండా రూల్ 71ని తీసుకు వచ్చాడు.దాంతో మండలి చైర్మన్ సభలోకి మూడు రాజధానుల బిల్లును తీసుకు వచ్చేందుకు అనుమతించలేదు.
చైర్మన్ తీరుపై సీఎం మరియు మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇది పద్దతి కాదని, చైర్మన్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలంటూ బొత్స అన్నాడు.
మండలిలో మూడు రాజధానుల బిల్లు ఆగిపోవడంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.