ఆ యాడ్ చేయనని చెప్పిన యష్..!

కన్నడ స్టార్ హీరో యశ్ కె.జి.

ఎఫ్ రెండు పార్ట్ లతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ కొట్టగా చాప్టర్ 2 భారీ అంచనాలతో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకుంది.

ఇక ఈ రెండు పార్ట్ లతో యశ్ కు నేషనల్ వైడ్ భారీ క్రేజ్ ఏర్పడింది.ప్రభాస్ కి బాహుబలి రెండు పార్ట్ లకు వచ్చిన క్రేజ్ తరహా యశ్ కు ఇప్పుడు నేషనల్ వైడ్ సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక ఈ ఫాం లో తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ని చేయకుండా ఆచితూచి అడుగులేస్తున్నాడు యశ్.ముఖ్యంగా నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న యశ్ కు ఈమధ్య ఓ సిగరెట్ యాడ్ ప్రమోషన్ ఆఫర్ వచ్చిందట.అతను అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చి యశ్ తో ఆ సిగరెట్ బ్రాండ్ ప్రమోట్ చేయాలని అనుకున్నారు.

Advertisement

కానీ యశ్ అందుకు నిరాకరించాడని తెలుస్తుంది.కేవలం సినిమాల్లో అది కూడా ఆ పాత్ర కోసం సిగరెట్ వెలిగించా తప్ప తన సొంత ప్రయోజనాల కోసం సిగరెట్ తాగమని.

అలాంటి వాటిని ప్రమోట్ చేయనని చెప్పాడట యశ్.యశ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అతని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ఓ పాన్ పరాగ్ యాడ్ ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో యశ్, అల్లు అర్జున్ ఇద్దరి ఆలోచన ఒకేలా ఉన్నాయి.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు