కన్నడ స్టార్ యశ్ కు భారీ ప్రాజెక్టుల్లో అవకాశం.. బ్రహ్మాస్త్రతో పాటు?

సినీ ప్రేక్షకులకు కనడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 1,చాప్టర్ 2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Yash Offered To Play Dev Role In Brahmastra 2 Details, Yash, Brahmastra 2, Kgf 1-TeluguStop.com

కాగా ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించి రికార్డులను బద్దలు కొట్టింది.

అయితే కేజిఎఫ్ సినిమా తర్వాత యష్ ఎప్పుడెప్పుడు తన తదుపరి సినిమాను ప్రకటిస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కేజిఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తదుపరి సినిమా కేజీఫ్ సినిమాకు తగ్గట్టుగా ఉండాలి అనుకున్నా యశ్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో యశ్ కి సంబంధించి వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే యశ్ కి బాలీవుడ్ రెండు ప్రాజెక్టులలో అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా కర్ణ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Brahmastra, Dev Role, Rakeshom, Yash, Yashbollywood, Yash Latest, Karna,

మహా భారతం లోని కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు.కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు.అందులో కర్ణుడి పాత్రకు యశ్ అయితే సరిగ్గా సరిపోతాడని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.అలాగే మరొక సినిమా బ్రహాస్త్ర 2. ఈ సినిమాలో దేవ్ పాత్ర చేయాలని యశ్ ని మూవీ మేకర్స్ కోరగా అందుకు యశ్ నో చెప్పాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ రెండు సినిమాలలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి ఒకే చెబుతాడా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.కాగా వచ్చే ఏడాది జనవరిలో యశ్ పుట్టిన రోజు సందర్భంగా అతడి తదుపరి సినిమాల విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube