రాంగ్ టైం లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన మంచి సినిమాలు ఇవే !

ఒక దర్శకుడికి కథను ఎలా సిద్ధం చేసుకోవాలి, స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలి అని మాత్రమే కాదు.షూటింగ్ ఎలా చేయాలి? ఎలాంటి నటులను తీసుకుంటే వారి పాత్రులకు న్యాయం చేయగలరు, అలాగే సినిమాను ఎలా విడుదల చేయాలి, ఎప్పుడు విడుదల చేయాలి అనే అన్ని అంశాలపై మంచి పట్టు ఉండాలి.

అలా ఉంటే తప్ప సినిమాని అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లలేరు.

పైగా సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని విడుదల చేయడం మరో ఎత్తుగా ఉంది ఇప్పుడున్న పరిస్థితులు.అలాంటి పరిస్థితులలో సినిమాని రాంగ్ టైంలో విడుదల చేస్తే కూడా మంచి సినిమా కిల్ అయ్యే అవకాశం ఉంటుంది.

అందుకే సినిమా తీయడం మాత్రమే ముఖ్యం కాదు.సినిమా విడుదల చేయడం, అది కూడా సరైన టైంలో విడుదల చేయడం అనేది కూడా చాలా ముఖ్యం.ఆ లోపం కారణంగా కొన్ని మంచి సినిమాలు పరాజయాలు అయ్యాయి.

అవి ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టైగర్ నాగేశ్వరరావు

(Tiger Nageswara Rao)

Advertisement

రవితేజ హీరోగా (Ravi Teja)వచ్చిన ఈ సినిమా లియో మరియు భగవంత్ కేసరి సినిమా లో టైంలోనే విడుదలైంది.అవి రెండు పెద్ద సినిమా హీరోలు కాబట్టి టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) చిత్రానికి తక్కువ థియేటర్స్ దొరికాయి.అందువల్ల ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అయ్యింది.

డెవిల్

(Devil)

కళ్యాణ్ రామ్ బింబిసార (kalyan ram, bimbisara)సినిమా తర్వాత తీసిన చిత్రం డెవిల్.ఈ సినిమా సలార్ సినిమాకి సంక్రాంతి సినిమాలకు మధ్య ఎటు కానీ ఓ టైంలో విడుదలై పరాజయం పాలైంది.ఒకవేళ ఆ సమయంలో కాకుండా మరో టైంలో విడుదల చేసి ఉంటే దాని రిజల్ట్ మరోలా ఉండేది.

అంటే సుందరానికి

(Ante Sundaraniki)

చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నజ్రియా(Heroine Nazriya).ఈ సినిమాలో నాని హీరోగా నటించగా ఈ చిత్రం అడవి శేషు(Adavi Seshu) నటించిన మేజర్ చిత్రానికి కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాకి మధ్యలో విడుదల అయింది.పైగా ఈ చిత్రం విడుదలైన టైం లో చాలా వర్షాలు కూడా ఉన్నాయి.

అందుకే ఇది పరాజయం పాలవడానికి ఇది కూడా ఒక కారణం.

సైంధవ్

(Saindhav)

కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై2, మంగళవారం 2024

వెంకటేష్ (Venkatesh)నటించిన ఈ సినిమా కథ చాలా బాగుంటుంది.కానీ లవ్ స్టోరీస్ కి చాలా ఫేమస్ ఆయన సంక్రాంతి పండగకు విడుదలై ఆ కాంపిటీషన్ ని తట్టుకోలేక పక్కకు వెళ్లిపోయింది.ఒకవేళ వేరే టైం లో రిలీజ్ చేసి ఉండే ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

Advertisement

తాజా వార్తలు