ఒక్కోసారి కొంతమంది నచ్చితే వారినే మళ్లీ మళ్లీ తమ సినిమాలో నటించాలని కోరుతూ ఉంటారు కొంతమంది డైరెక్టర్ లేదా హీరోస్.ఒకసారి రిజెక్ట్ చేసిన రెండవసారి మళ్లీ రిజెక్ట్ చేసిన మూడోసారి అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి.
అవతల వారి ప్రాజెక్టు వివరాలు ఏంటో తెలియక మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల వారు చేయలేకపోవచ్చు.కానీ చేయకూడదు అనే ఇంటెన్షన్స్ ఏమీ ఉండవు.అయినా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ వల్ల కొంతమంది సెలబ్రిటీస్ ఎన్నిసార్లు అడిగినా కూడా కొంతమంది సినిమాల్లో నటించలేకపోయారు మరి ఆ సెలబ్రిటీస్ ఎవరు ? అడిగింది ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పృధ్విరాజ్ సుకుమారన్
సలార్ సినిమాలో ప్రభాస్ కాంబినేషన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran , Prabhas) తొలిసారిగా నేరుగా ఒక తెలుగు సినిమాలో నటించారు.ఈ సినిమాలో వీరి కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది.అయితే అంతకన్నా ముందే చిరంజీవి(Chiranjeevi) రెండుసార్లు అడిగినా కూడా పృథ్విరాజ్ సుకుమారన్ ఆయన సినిమాల్లో నటించలేకపోయారు.
అందుకు కారణం గోట్ లైఫ్ సినిమాతో పృథ్వీరాజ్ బిజీగా ఉండటమే.చిరంజీవి గాడ్ ఫాదర్, సైరా నరసింహారెడ్డి (Chiranjeevi Godfather, Saira Narasimha Reddy)చిత్రాల్లో నటించాలని కోరగా ఆయన కుదరలేదు.
చాందినీ చౌదరి
చాందిని చౌదరి రాజ్ తరుణ్ ఇద్దరూ కూడా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ స్టార్డం సంపాదించుకొని ఆ తర్వాత వెండితెరపై ఒక వెలుగు వెలిగారు అయితే రాజ్ తరుణ్ హీరోగా నటించిన మొదటి మూడు సినిమాలకు చాందినీ హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నించిన మూడు సార్లు కూడా ఆమెకు కుదరలేదట.
శర్వానంద్
శర్వానంద్ (Sharvanand)హీరోగా మొట్టమొదటిగా సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి సినిమాను అనుకున్నాడట.ఆ కథను ఆయనకు వినిపించగా అందుకు ఒప్పుకోలేదట అలాంటి కథ కి తాను సూట్ కానని చెప్పారట ఆ తర్వాత కూడా మరో కథతో ఆయన దగ్గరికి వెళ్ళగా ఇంకా ఏదైనా వేరే కథ ఉంటే చెప్పండి.ఈ కథలో నటించలేనని చెప్పారట.
ఇలా రెండుసార్లు శర్వానంద్ నే తన హీరోగా అనుకున్నారు సందీప్ రెడ్డివంగా.