Donald Trump : అమెరికా చరిత్రలోనే ‘‘ చెత్త అధ్యక్షుడు ’’.. జో బైడెన్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్ ఫైర్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) దూసుకెళ్తున్నారు.

సూపర్ ట్యూస్‌డేలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన 15 పోటీలలో 12 చోట్ల సునాయాసంగా విజయాలు సాధించారు ట్రంప్.

ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) ఓపెన్ బోర్డర్ విధానాలపై ఆయన మండిపడ్డారు.దాదాపు 10 మిలియన్ల మంది అక్రమ వలసదారులను బైడెన్ యంత్రాంగం అమెరికాలోకి అనుమతించిందని ఆయన దుయ్యబట్టారు.అమెరికా చరిత్రలోనే జో బైడెన్ చెత్త అధ్యక్షుడని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.2021 నుంచి దేశంలోని 43 నగరాల్లోకి అక్రమ వలసదారులు ప్రవేశించారని ట్రంప్ పేర్కొన్నారు.బైడెన్ దాదాపు 3,20,000 మంది వలసదారులను రహస్యంగా దేశంలోకి ఎలా పంపించాడో ఇటీవల ఓ నివేదిక వెల్లడించిందని ట్రంప్ పేర్కొన్నారు.

ఫ్లోరిడా( Florida )లోని తన మార్ ఏ లాగో క్లబ్ లోని సంపన్నమైన బాల్రూమ్ ప్రసంగం సమయంలో ట్రంప్.అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు.ఆరిజోనా, టెక్సాస్ రాష్ట్రాల గవర్నర్లు వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా రాజకీయాలను ఆయుధంగా చేసినందుకు బైడెన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు.ట్రంప్ వరుసగా మూడవసారి రిపబ్లికన్ నామినేషన్ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

మాకు అద్భుతమైన ప్రతిభ వున్న గొప్ప రిపబ్లికన్ పార్టీ ( Republican Party )వుందని, తాము ఐక్యతను కోరుకుంటున్నామని ట్రంప్ చెప్పారు.

తాము సరిహద్దులను మూసివేస్తామని అమెరికాను గతంలో కంటే గొప్పగా మార్చబోతున్నామని , ద్రవ్యోల్బణాన్ని తగ్గించబోతున్నామని ఆయన పేర్కొన్నారు.ద్రవ్యోల్భణం మధ్య తరగతిని నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా మెక్సికో( Mexico ) సరిహద్దుల్లో వ్యవహరించిన తీరు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనికులను ఉపసంహరిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ విమర్శించారు.

తన పర్యవేక్షణలో అంతర్జాతీయ సంఘర్షణలు సంభవించవని ఆయన హామీ ఇచ్చారు.ఇదిలావుండగా.2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, జో బైడెన్ మధ్యే పోరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.సూపర్ ట్యూస్‌డే ప్రైమరీల పేరిట మంగళవారం 15 రాష్ట్రాలు, ఒక టెరిటరీలో ప్రైమరీ, కాకస్ ఎన్నికలు జరిగాయి.

వీటిలో వీరిద్దరూ మంచి విజయాలను నమోదు చేశారు.రిపబ్లికన్, డెమొక్రాట్ నామినేషన్‌ను పొందడాదనికి ట్రంప్ మార్చి 12 వరకు, బైడెన్ 19 వరకు నిరీక్షించాల్సి వుంది.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు