ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ చైనాలో ఉంది.చైనాలోని( China ) నాన్ జిల్లా చాంగ్ కింగ్ నగర శివారల్లోని కొండ ప్రాంతాల్లో ఈ రెస్టారెంట్( Restaurant ) ఉంది.
ప్రపంచంలోనే అదిపెద్ద రెస్టారెంట్ ఇదేనని చెబుతున్నారు.ఈ రెస్టారెంట్ పేరే పాపి యువాన్ కాగా.
ఈ రెస్టారెంట్ కు అసలు ఆ పేరు ఎలా వచ్చింది.ఈ రెస్టారెంట్ ప్రత్యేకతులు ఏంటి.
ఎంతమంది కూర్చోవచ్చనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఈ రెస్టారెంట్ లో మొత్తం 900కిపైగా టేబుళ్లు ఉండగా.3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంటుంది.ఈ రెస్టారెంట్ లో 5,800 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు.2022లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్( Guinness Book Of World Records ) లోనూ ఈ రెస్టారెంట్ పేరు సంపాదించుకుంది.
చైనాలోని పాపులర్ డిషెస్ అన్నీ ఈ రెస్టారెంట్ లో లభిస్తాయి.ఈ రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది చాలామంది ఉన్నారు.ఏకంగా 25 మంది క్యాషియర్స్ తో పాటు వెయిటర్లు, చెఫ్ లు, క్లీనింగ్ సిబ్బంది వందల మంది ఉంటారు.
ఈ రెస్టారెంట్ 24 గంటల పాటు తెరిచే ఉంటుంది.రాత్రి సమయంలో కూడా ఈ పెద్ద రెస్టారెంట్ కు కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.
ఇక రెస్టారెంట్ లో ఏదైనా డిష్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అరగంటసేపు వేచి చేయాల్సి ఉంటుంది.
అలాగే టేబుళ్లను బుక్ చేసుకున్న కస్టమర్లను వారికి కేటాయించిన టేబుల్ చూపించేందుకు ప్రత్యేకంగా కొంతమంది సిబ్బంది ఉంటారు .ఇక వేసవి కాలంలో అయితే ఈ రెస్టారెంట్ లో టేబుల్ కూడా దొరకదు.టేబుల్ బుక్ చేసుకోకుండా రెస్టారెంట్ కి వెళితే మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
పెద్ద రెస్టారెంట్, ఎక్కువగా కస్టమర్లు వస్తారు గనుక ఆహార పదార్థాలు రుచిగా చేయరని చాలామంది అనుకుంటూ ఉంటారు.కానీ ఇక్కడి డిషెస్ చాలా టేస్టీగా ఉంటాయి.