వాతావరణంలో వస్తున్న మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ ‘మిషన్ లైఫ్-లైఫ్ స్టైయిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీంతో ఫ్రాన్స్, యూకే, మాల్దీవులులతో సహా ప్రపంచ దేశాల నేతలు ప్రధాని మోడీని అభినందనలు తెలిపారు.
ప్రధాని మోడీ యువర్ గ్రేట్ అంటూ.మిషన్ లైఫ్‌కు ప్రపంచదేశాల నేతలు అండగా నిలుస్తామని చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఓ వీడియోలో మాట్లాడుతూ.‘ప్రియమైన నరేంద్ర మోడీ.
వచ్చే ఏడాది జీ20 అధ్యక్ష స్థానంలోకి ఇండియా వస్తోంది.భారత్‌లో కలిసి పనిచేయడానికి మేం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం.
కెవాడియాలో మిషన్ లైఫ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది.
దీనికి మద్దతు తెలుపుతున్నాను.
ప్రపంచ దేశాల్లో జియో పొలిటికల్ టెన్షన్లు పెరుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు పరస్పర సహకారం చేసుకోవాలి.
’ అని పేర్కొన్నారు.అలాగే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ కూడా ప్రధాని మోడీని అభినందించారు.
ఈ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ.‘ప్రజాస్వామ్య దేశాలు కలిసికట్టుగా పని చేయాలి.
పర్యావరణం, వాతావరణ మార్పులపై కలిసికట్టుగా పని చేయాలి.ఇండియా వంటి ప్రజాస్వామ్య దేశంతో కలిసి పని చేయడానికి సంతోషంగా ఉంది.
‘మిషన్ లైఫ్’ను ప్రారంభించిన భారత దేశానికి నా అభినందనలు.’ అని చెప్పారు.

మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సొలిస్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.‘మిషన్ లైఫ్ ప్రారంభించిన ప్రధాని మోడీకి అభినందనలు.వాతావరణ సంక్షోభ సమయంలో మిషన్ లైఫ్ ప్రారంభించడం అందరికీ ఆదర్శనీయం.వాతావరణ మార్పులను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలి.వరల్డ్ క్లీనింగ్ డేలో భారత్‌తో కలిసి చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి.
’ అని తెలిపారు.కాగా, ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి జీ20 గ్రూప్ అధ్యక్ష పదవి పగ్గాలను భారత్ చేపట్టనుంది.
ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది.