ఈ మధ్య కాలంలో మహిళలకి బాహ్య ప్రపంచం లోనే కాదు తమ ఇళ్లల్లో, అలాగే పనిచేసే కార్యాలయాల్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా ఇటీవలే ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మహిళలు ఎక్కువగా తాము పని చేసేటువంటి కార్యాలయాలల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు తెలుసుకున్నారు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పలు సంస్థలు ఇంట్లో నుంచి పనిచేసే వెలుసు బాటు కల్పించినప్పటికీ ఆన్ లైన్ వీడియో కాల్స్ ద్వారా కూడా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా తెలుస్తోంది.
అయితే ఇందులో భాగంగా సర్వే చేసేటువంటి అధికారులు ఇంట్లో ఉండి పని చేసినటువంటి ఉద్యోగులను ప్రశ్నించారు.
దీంతో కొందరు ఉద్యోగులు ఈ విషయంపై స్పందిస్తూ తమ కార్యాలయాల్లో పని చేసేటువంటి పై అధికారులు సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగ విధుల నిమిత్తమై మాట్లాడే పని ఉంది అంటూ ఫోన్లు చేసి విసిగిస్తున్నారని తెలిపారట.మరికొందరైతే ఏకంగా వీడియో కాల్స్ లో అర్ధనగ్న ప్రదర్శన చేయాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారట.
అయితే సమయాన్ని వినియోగించుకునేందుకు ఇంట్లో ఉండి పని చేసే వెసులుబాటు కల్పించడం మంచి విషయమే అయినప్పటికీ కొందరు అధికారులు ఈ విషయాన్ని అలుసుగా తీసుకొని విధుల పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని దీంతో మహిళలకి తాము పనిచేసే కార్యాలయాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరి కొందరు మహిళా ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కొందరు మహిళా ఉద్యోగులు ఈ విషయంపై స్పందిస్తూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
అంతే కాకుండా ఇంట్లో ఉండి పనిచేసే మహిళలకు సపరేట్ గా ఉద్యోగ టైమింగ్స్ ఉండాలని కూడా కోరుతున్నారు.