కరోనా ముప్పు తప్పినా.. ఇకపై అంతా వర్క్ ఫ్రమ్ హోమే: బిల్‌గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

కోవిడ్ 19 వ్యాప్తితో మానవ జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా పని చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి.

ఇందులో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్.ఒకప్పుడు కేవలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితమైన ఈ కాన్సెప్ట్ లాక్‌డౌన్ పుణ్యమా అని అన్ని రంగాలకూ విస్తరించింది.

కేవలం తయారీ రంగంలో తప్పనిసరిగా ఆఫీస్ కు రావాల్సిన సిబ్బంది మినహా మిగితా అందరూ ఇంటి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు మొదలయ్యాయి.తొలుత ఇదొక తాత్కాలిక చర్య మాత్రమే అనుకున్నప్పటికీ.

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ తో ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పర్మనెంట్ అయ్యేలా ఉందని కంపెనీలు, విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రతి విధానంలోనూ ఉన్నట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ లోనూ మంచి, చెడు మిళితమై ఉన్నాయి.

Advertisement

అయినా సరే ఇందులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలు ఈ విధానానికి జై కొడుతున్నట్లు స్పష్టమవుతోంది.గతంలో ఆఫీస్ కు వెళ్లి పనిచేసేప్పుడు నిర్ణీత సమయం మాత్రమే పని ఉండేది.

ఆఫీస్ నుంచి వచ్చేస్తే ఇక మళ్ళీ మరుసటి రోజు మాత్రమే పని మొదలయ్యేది.వర్కింగ్ డే లోనూ మధ్యలో టి బ్రేక్, లంచ్ బ్రేక్ ఉండేవి.

ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది.కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అవేమీ కుదరటం లేదు.

ఒక నిర్ణీత సమయం అంటూ ఏమీ లేకుండా ఎప్పుడైనా పనిచెబుతున్నారు.పని పూర్తయ్యేంత వరకు పని చేస్తూనే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీంతో సాధారణం కంటే కనీసం 20-25% అధిక పని గంటలు పనిచేస్తున్నారు ఉద్యోగులు.ఈ విధానంతో ఉత్పాదకత గణనీయంగా పెరిగిపోయింది.

Advertisement

కాబట్టి కంపెనీలకు ఇదొక అద్భుతమైన అవకాశం లా కనిపిస్తోంది.ఈ కారణం చేత లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ను పొడిగిస్తూ పోతున్నాయి.

అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ చాలా బాగా సక్సెస్ అయ్యిందన్నారు.

కరోనా ముప్పు తొలగిన తర్వాత కూడా చాలా కంపెనీలు ఇదే విధానంలో కొనసాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.కంపెనీలు తమ ఉద్యోగులు 50 శాతం కంటే తక్కువ సమయమే కార్యాలయాల్లో ఉండేలా ప్రణాళిక రచించుకోవచ్చని బిల్‌గేట్స్ చెప్పారు.

ఇతర సంస్థలు మాత్రం ఎప్పటిలాగే సాధారణ పద్ధతిలోనే కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.అయితే సాఫ్ట్‌వేర్‌‌ను మరింత మెరుగుపరచాలని, చిన్న ఇళ్లలో ఉన్న వారికి ఈ పద్ధతి కష్టమని బిల్‌గేట్స్ అన్నారు.

ముఖ్యంగా ఇంటి పని, ఆఫీసు పని చేసే మహిళలకు కూడా ఇబ్బందిగా మారవచ్చని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.ఓ దినపత్రిక నిర్వహించిన ఆన్‌లైన్ వ్యాపార సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు