జగన్ అనుకున్నట్లే చేశాడు

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వై కా పా అధినేత జగన్ హాజరు కాకపోవచ్చని మొదటినుంచి అనుమానాలు ఉన్నాయి.

చివరకు దాన్నే నిజం చేశాడు జగన్.

శంకుస్థాపనకు తాను హాజరు కావడంలేదని జగన్ స్పష్టం చేశాడు.కేవలం నోటిమాట ద్వారా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశాడు.

జగన్ వెళ్ళకపోతే ఆయన పార్టీ నాయకులు కూడా వెళ్ళరు.వెళ్ళకపోతే ఏం కారణం చెబుతాడో ముందుగా ఊహించిందే.

ఈ విషయం తెలుగు స్పాట్ ముందుగానే తెలియచేసింది.రాజధాని నిర్మాణం విషయంలో బాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వ్యవహరిస్తున్న తీరును మొదటినుంచి జగన్ వ్యతిరేకిస్తున్నాడు.

Advertisement

ఏడాదికి మూడు పంటలు పండే భూములను తీసుకోద్దని తాము మొదటి నుంచి చెబుతున్న బాబు వినలేదని జగన్ తన లేఖలో పేర్కొన్నాడు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ తాను శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

శంకుస్థాపనకు 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న తీరును జగన్ తీవ్రంగా నిరసించాడు.కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుండగా విదేశీ కంపనీలను ఎందుకు రప్పిస్తున్నారని ప్రశ్నించారు.

మొత్తం మీద జగన్ ఏం చెప్పారంటే రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి అందుకు నిరసనగానే తాను పోవడం లేదని చెప్పాడు.భవిష్యత్తులో ఈ చర్య రాజకీయంగా జగన్కు లాభిస్తుందా? ఆయన దీన్ని ఎలా ప్రచారం చేసుకుంటారు? .

నమ్మినోళ్లే నట్టేట ముంచుతున్నారుగా ? 
Advertisement

తాజా వార్తలు