మొటిమల తాలూకు మచ్చలు బాగా విసిగిస్తున్నాయా.. వారం రోజుల్లో వదిలించుకోండిలా?

మొటిమలు( Acne ).దాదాపు అందరూ ఎదుర్కొనే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.

అయితే మొటిమలు వచ్చినప్పుడు కొందరికి రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతాయి.కొందరికి కాస్త లేటుగా తగ్గుతుంటాయి.

అయితే చాలామందిలో మొటిమలు పోయిన వాటి తాలూకు మచ్చలు మాత్రం అలానే ఉండిపోతాయి.ఆ మచ్చలు ముఖంలో కాంతిని దెబ్బతీస్తాయి.

అందాన్ని తగ్గిస్తాయి.మిమ్మల్ని కూడా మొటిమల తాలూకు మచ్చలు బాగా విసిగిస్తున్నాయా.? అయితే అస్సలు వర్రీ అవకండి.ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ సీరం ను కనుక వాడితే వారం రోజుల్లోనే ఆ మచ్చల‌ను వదిలించుకోవచ్చు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకు మరియు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Clove ) వేసి మరిగించాలి.వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు స్పూన్లు అలోవెరా జెల్‌, చిటికెడు ఆర్గానిక్ పసుపు మరియు నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా ఫిక్స్ చేసుకోవాలి.దాదాపు 5 నిమిషాల పాటు కలిపితే మన సీరం అవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందు మరియు నిద్రపోయే ముందు తయారు చేసుకున్న సీరం ముఖానికి అప్లై చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు కనుక ఈ న్యాచురల్ సీరం ను వాడితే చాలా కొద్ది రోజుల్లోనే మొటిమలు తాలూకు మచ్చలు మాయమవుతాయి.అదే సమయంలో ఈ సీరం ను వాడటం వల్ల చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.

Advertisement

అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.దాంతో మొటిమలు రావడం తగ్గుతాయి.

కాబట్టి మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.క్లియర్ స్కిన్ ను మీ సొంతం చేసుకోండి.

తాజా వార్తలు