చ‌ర్మ ఛాయ‌ను పెంచే గ్లిజ‌రిన్..ఎలా వాడాలంటే?

చ‌ర్మ ఛాయ‌ను పెంచుకోవాల‌ని ప్ర‌య‌త్నించే వారు కోక‌ల్లు.అందుకోసం వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ఖ‌రీదైన క్రీములు కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే గ్లిజరిన్‌ను మాత్రం ప‌ట్టించుకోరు.నిజానికి సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా స‌హాయ ప‌డుతుంది.

కూర‌గాయ‌ల కొవ్వు మ‌రియు నూనె నుంచి త‌యారు చేయ‌బ‌డే గ్లిజ‌రిన్‌ ఎటువంటి రంగు, వాస‌న‌ క‌లిగి ఉండ‌దు.కానీ, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలో గ్లిజ‌రిన్‌ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

మ‌రి గ్లిజ‌రిన్ ను చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.చ‌ర్మ ఛాయ‌ను పెంచుకోవాల‌నుకునే వారు ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ గ్లిజ‌రిన్‌, రెండు స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో ముఖానికి, మెడ‌కు అద్దుకోవాలి.బాగా ఆర‌నిచ్చి అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది.

అలాగే మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను కూడా గ్లిజ‌రిన్ నివారించ‌గ‌ల‌దు.ఒక బౌల్‌లో అర స్పూన్ గ్లిజ‌రిన్‌, ఒక‌టిన్న‌ర స్పూన్ లెమ‌న్ వాట‌ర్ వేసుకుని క‌లిపి మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉన్న చోట అప్లై చేయాలి.ప‌దిహేను, ఇర‌వై నిమిషాల త‌ర్వాత‌ కూల్ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే క్ర‌మంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు మ‌టుమాయం అవుతాయి.ఇక పెద‌వుల‌ను మృదువుగా, కాంతివంతంగా మార్చ‌డంలోనూ గ్లిజ‌రిన్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఒక స్పూన్ గ్లిజ‌రిన్‌ను, ఒక స్పూన్ బాదం ఆయిల్‌ను గిన్నెలో తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని రాత్రి నిద్రించే ముందు పెద‌వులకు అప్లై చేసి.

Advertisement

ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే పెద‌వులు అందంగా, మృదువుగా మార‌తాయి.

తాజా వార్తలు