డబ్బులు ఖర్చు పెడుతున్నాడని భర్తని దారుణంగా చంపిన రష్మీ...

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు మోజులో పడి బంధాలకు విలువ ఇవ్వకుండా నా అనుకున్న వాళ్ళని కడతెరుస్తున్నారు.

తాజాగా ఓ మహిళ తన రెండవ భర్త డబ్బులు దుబారాగా ఖర్చు పెడుతున్నాడని ఏకంగా తన సోదరులతో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే రష్మీ అనే ఓ మహిళ బెంగళూరు నగరంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.అయితే ఈమె పలు వ్యక్తిగత కారణాల వల్ల తన మొదటి భర్త తో విడిపోయింది.

అయితే ఆ తర్వాత సోషల్ మీడియా మాధ్యమం అయిన  పేస్ బుక్ ద్వారా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పరిచయమయ్యాడు.ఈ పరిచయం కాస్త పరిణయానికి దారి తీసింది.

అయితే  పెళ్లి అయిన మొదట్లో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.ఈ క్రమంలో తన మొదటి భర్త నుంచి విడిపోయిన అందుకుగాను తన వాటాగా రష్మీకి దాదాపుగా కోటి రూపాయల పై చిలుకు డబ్బు అందింది.

Advertisement

దీంతో సుబ్రహ్మణ్యం తనకు వ్యాపారం చేయాలని ఉందని అందుకుగాను కొంత డబ్బు అవసరం అవుతుందని తన భార్య రష్మీకి తెలుపగా ఆమె దాదాపుగా 80 లక్షల రూపాయలకు పైగా సుబ్రహ్మణ్యానికి ఇచ్చింది.

దీంతో అతడు ఆ డబ్బు మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో వ్యాపారంలో పెట్టాడు.అయితే ఈ వ్యాపారంలో లాభాలు రాకపోగా అవగాహన లోపం కారణంగా తీవ్ర నష్టాలను చవి చూశాడు.దీంతో మరిన్ని చోట్ల అప్పులు చేశాడు.

ఈ విషయం తెలుసుకున్నరష్మీ వ్యాపార నిమిత్తమై తీసుకున్నటువంటి తన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరింది.అయితే ఈ విషయంపై సుబ్రహ్మణ్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది.

ఈ క్రమంలో తన సొంత భర్తనే కడతేర్చే ఎందుకు తన సోదరులతో కలిసి పన్నాగం పన్నింది.ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంని కిడ్నాప్ చేసి డబ్బు కోసం చిత్రహింసలు పెట్టింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

అయితే చివరికి సుబ్రహ్మణ్యం డబ్బులు చెల్లించలేడని తెలుసుకొని అతడిని తన ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయింది.అయితే చిత్రహింసలకు గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సుబ్రమణ్యాన్ని స్థానికులు గమనించి దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement

అయితే కొంత మేర స్పృహలోకి వచ్చి నటువంటి సుబ్రహ్మణ్యం పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.అయితే సుబ్రమణ్యం ప్రాణాలతో ఉన్నాడన్న విషయం తెలుసుకున్నటువంటి రష్మి పోలీసులకు విషయం తెలిస్తే ఎక్కడ తనను అరెస్టు చేస్తారెమో అని భయపడి పరారి అయింది.

దీంతో పోలీసులు ఆమెను గాలించి పట్టుకుని విచారించగా తానే డబ్బు కోసం ఈ నేరాన్ని చేసినట్లు అంగీకరించింది.అయితే ఈ నేరానికి సహకరించినటువంటి తన సోదరులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారి ఆచూకీ తనకు తెలియదని పోలీసులకు తెలిపింది.

దీంతో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

తాజా వార్తలు