తెలుగు ప్రజల ఆత్మ గౌరవమే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని( TDP ) స్థాపిస్తే మహిళల ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే విధంగా ప్రోత్సహించడమే తమ పార్టీ ప్రస్తుత లక్ష్యం అంటూ ప్రకటించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.( Chandrababu Naidu ) ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం పథకం లో మహిళలకు సిలిండర్లు ఇచ్చామనీ , మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కోసమే డ్వాక్రా పథకాలను ప్రవేశపెట్టామని మరోసారి అధికారంలోకి వస్తే మహిళా శక్తి( Mahila Shakti ) పేరుతో వారి భవిష్యత్తుకు బాట పరుస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు.
త్వరలో దసరా సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని అందులో మహిళలకు పెద్దపీట వేస్తామని ఆ మేనిఫెస్టోను కూడా మహిళలు సమక్షంలోనే ప్రకటిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి స్త్రీ పక్షపాత పార్టీగానే ఉందని ప్రతి ఆర్థిక సంబంధిత పథకాన్ని కూడా మహిళల భాగస్వామ్యం ఉండే విధంగా చూసుకున్నామని ఇకపై కూడా ప్రతి కుటుంబంలోనూ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15 వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా తల్లికి వందనం పథకం ప్రవేశపెడుతున్నామని, హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.రాఖీ పౌర్ణమి( Rakhi Pournami ) సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.మహిళలు ( Women ) అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్లే విధంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని మహిళల పట్ల వారి సర్వతోముఖ అభివృద్ధి పట్ల

తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంటుందని ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల వల్ల ధనవంతుడు మరింత ధనికుడై పేదవాళ్లు మరింత పేదవాళ్ళు అయిపోతున్నారని తమ ప్రభుత్వం ప్రభుత్వ -ప్రైవేటు- ప్రజల భాగస్వామ్యంతో పథకాల రూపకల్పన చేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.గత ఎన్నికల్లో మహిళా ఓటర్ల ఆదరణ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయడంలో విఫలం అవ్వడం ద్వారానే విజయం సాధించలేకపోయామని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ తమ నిర్దిష్ట ఓటు బ్యాంకు అయినా మహిళా కార్డునే మరోసారి ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది
.