హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.డెయిరీఫామ్ చౌరస్తాకు సమీపంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో సెల్లార్ లో పార్క్ చేసిన బైకులు, కార్లు దగ్ధం అయ్యాయని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అపార్ట్ మెంట్ వాసులు భావిస్తున్నారని తెలుస్తోంది.