కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది.ఇప్పటికే చాలా మంది కరోనా కారణంగా మృతిచెందారు.
రోజుకో వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.భారత్ లో కూడా రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి.
తాజాగా సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో జరిగిన ఓ ఘటన అందరితో కంటతడి పెట్టిస్తోంది.కరోనా బారిన పడిన ఓ యువతి వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది.
ఆమె ప్రియుడు నువ్వు కోలుకుంటావు.మనం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాం అని ఆమెకు ధైర్యం చెప్పాడు.
ఆస్పత్రి బెడ్ పైనే ఆమెకు తాళి కూడా కట్టాడు.కానీ దురదృష్టవశాత్తూ ఆ యువతి కరోనాతో పోరాడుతూ మృతిచెందింది.ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి(27) తాను ప్రేమించిన వ్యక్తిని త్వరలో వివాహం చేసుకుని.
కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది.కానీ ఇంతలోనే ఆమె కరోనా వైరస్ బారిన పడింది.
చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ చేశారు.ఆమెను ఓ యువకుడు మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు.
వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు.ఆ యువకుడు తన ప్రియురాలిని కాపాడకునేందకు చాలా ప్రయత్నాలు చేశాడు.

వైద్యుల అనుమతితో ఆమెకు ధైర్యం చెప్పాడు.ఆసుపత్రి బెడ్ పై ఉన్న యువతి మెడలో తాళి కట్టాడు.త్వరగా కోలుకుంటావని ధైర్యం చెప్పాడు.
దురదృష్టవశాత్తూ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ యువతి కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతూ కన్నుమూసింది.
ఆ యువతి సోదరుడు, ప్రేమించిన యువకుడే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.యువతి మరణించిన విషయం ఇంకా ఆమె తల్లిదండ్రులకు తెలియదు.
ఈ విషయం చెప్పేందుకు వారు సాహసించడం లేదు.ఆమె మృతితో ఆ కుటుంబంలో, ఆ యువకుడి జీవితంలో విషాదం నెలకొంది.
కరోనా మహమ్మారి ఇలా ఎంతో మందిని బలిగొంటూ.తమ కుటుంబ సభ్యులకు, ప్రేమించిన వారికి దుఃఖాన్ని మిగిల్చుతోంది.