రోగి వయోలిన్ వాయిస్తుండగా మెదడుకు సర్జరీ... వైరల్ అవుతున్న వీడియో

సాధారణంగా ఏదైనా సర్జరీ అంటే ఎవరైనా విపరీతమైన భయాందోళనకు గురవుతారు.రోగి, రోగి కుటుంబ సభ్యులు సర్జరీ పేరు వింటేనే కన్నీరుమున్నీరవుతారు.

ఎందుకంటే కొన్ని సందర్భాలలో సర్జరీలలో రోగులు ప్రణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.కానీ ఒక యువతి మాత్రం సర్జరీ అంటే ఏ మాత్రం భయపడకుండా స్పృహలో ఉండగానే మెదడుకు సర్జరీ చేయించుకుంది.

ఆపరేషన్ సమయంలో వయోలైన్ వాయిస్తూ మెదడుకు సర్జరీ చేయించుకుని యువతి డాక్టర్లను, కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది.లండన్ లోని కింగ్ కాలేజ్ హాస్పిటల్ లోని ఈ ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాలలోకి వెళితే ఒక యువతి సింఫనీ ఆర్కెస్ట్రాలొ వయోలిన వాద్యకారిణిగా పని చేస్తూ ఉండేది.కొన్ని రోజుల క్రితం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

సర్జరీ సమయంలో డాక్టర్లకు యువతి వేళ్లు, చేతులు పని చేస్తున్నాయో లేదో అని సందేహం రావడంతో ఆమెకు వయోలిన్ ఇచ్చి వాయించాలని వైద్యులు కోరారు.ఆమె వయోలిన్ వాయిస్తున్న సమయంలోనే మెదడులోనే కణతిని వైద్యులు తొలగించారు.మెదడులో కణతి తొలగిస్తే కొన్ని సందర్భాల్లో ఎడమ చేతికి సమస్యలు ఏర్పడతాయని ఇలాంటి ఆపరేషన్ జరిగే సమయంలో రోగి వేళ్లను కదపాలని అందుకే వయోలిన్ ఇచ్చి వాయించాలని కోరామని వైద్యులు చెబుతున్నారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు