పవన్ కి కరోనా ఎఫెక్ట్ : వకీల్ సాబ్ కూడా డౌటే... 

ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నటువంటి "వకీల్ సాబ్" అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించినటువంటి "పింక్" చిత్రానికి రీమేక్ గా ఉంది.

అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి "మగువా మగువా" అనే పాట కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

ఈ పాటను విడుదల చేసిన అనతి కాలంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా దేశంలో కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ప్రభావం వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పై కూడా పడినట్లు సమాచారం.దీంతో పవన్ కళ్యాణ్ కొద్ది రోజులపాటు వకీల్ సాబ్ షూటింగ్ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాడు.అంతేకాక ఇప్పటికే పలు ఈ సందర్భంలో కూడా ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు.

అయితే అనుకోని విధంగా కరోనా వైరస్ వల్ల చిత్ర షూటింగ్ వాయిదా పడడంతో అనుకున్న విధంగానే మే నెలలో "వకీల్ సాబ్"  చిత్రాన్ని విడుదల చేస్తారో లేదో చూడాలి.

అయితే ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని సినీ థియేటర్లను కూడా మూసి వేశారు.అంతేగాక తెలుగులో కూడా తాజాగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన టువంటి  "వి" చిత్ర విడుదలను కూడా వాయిదా వేశారు.ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

అలాగే టాలీవుడ్ లో పలు చిత్రాల షూటింగులు కూడా ప్రస్తుతం నిలిపివేశారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు