సీటు ఉంటుందా లేదా ? టీడీపీ సీనియర్లకు కొత్త టెన్షన్ 

ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ( TDP )లో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారితో పాటు , చంద్రబాబు టిడిపి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన వెంటే నడుస్తూ,  నమ్మకస్తులుగా పేరుపొందిన వారు చాలామంది ఉన్నారు.

వారంతా అప్పటి నుంచి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వివిధ పదవులు పొందిన వారే.అయితే ఈసారి జరగబోయే ఏపీ ఎన్నికల్లో సీనియర్లు పోటీ చేసే అవకాశం ఇస్తారా లేక వారిని పక్కన పెడతారా అనే విషయంపై గత కొద్ది రోజులుగా పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం టిడిపి ,జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో,  జనసేనకు భారీగానే సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి రాబోతోంది.జనసేన బలోపేతం కావడంతో పాటు , కొన్ని కొన్ని కీలక నియోజకవర్గలను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని ముందుగానే జనసేన షరతులు పెడుతుంది . జనసేన కోరుతున్న సీట్లలో చాలా వరకు టిడిపి సీనియర్ నాయకులు పోటీ చేద్దామని భావిస్తున్న నియోజకవర్గాలే ఉన్నాయి.దీంతో టిడిపి సీనియర్లు జనసేన కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో ఏఏ నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేయాలనుకుంటుందనే వివరాలతో కూడిన జాబుతాను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అందించారట.ఈ మేరకు దాదాపు 30 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉందట.

Advertisement

గతంలో ప్రజారాజ్యం గెలిచిన అసెంబ్లీ స్థానాలతో పాటు,  2019 ఎన్నికల్లో జనసేన కు ఎక్కువ ఓట్లు పడిన నియోజకవర్గాలను తమకు కేటాయించాల్సిందిగా పవన్ కోరుతున్నారట.

వీటిలో ఎక్కువగా టిడిపి సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉండడంతో , ఈ విషయంలో ఏం చేయాలనేదానికైనా చంద్రబాబు ఆలోచనలో పడ్డారట.జనసేనతో పొత్తు టిడిపికి అత్యవసరం అయిన నేపథ్యంలో ఆ పార్టీ డిమాండ్లకు అంగీకరించాల్సిన పరిస్థితి టిడిపికి ఏర్పడింది .ఈ క్రమంలో టిడిపి సీనియర్లు త్యాగాలకు సిద్ధం కావాల్సిందేనన్న సంకేతాలు విలువడుతున్నాయి.ముఖ్యంగా రాజమండ్రి రూరల్ , భీమవరం ,కాకినాడ , గాజువాక రాజోలు, తిరుపతి, కైకలూరు ,గిద్దలూరు,  ఆళ్లగడ్డ,  చిత్తూరు,  అమలాపురం, పెందుర్తి , తెనాలి, పి.గన్నవరం తో పాటు మరికొన్ని కీలక నియోజకవర్గలను జనసేన కోరుతోందట .రాజమండ్రి రూరల్ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య( Gorantla Butchaiah Chowdary ) చౌదరి ఉన్నారు.

 ఈ సీటులో జనసేన నేత కందుల దుర్గేష్( Kandula Durgesh ) ను పోటీకి దింపే ఆలోచనలో పవన్ ఉన్నారట.అలాగే భీమవరం గాజువాకలో పవన్ మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందట.  ఇక తెనాలిలో టిడిపి నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ బలంగా ఉన్నప్పటికీ ఈ సీటును జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.

ఇదేవిధంగా టిడిపి సీనియర్లు ఆశలు పెట్టుకున్న చాలా నియోజకవర్గాలపై జనసేన కన్నేయడంతో టిడిపి సీనియర్లు త్యాగాలకు సిద్ధం కావాల్సిందే అన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు