టీఆర్ఎస్ ఢిల్లీ పర్యటనతో ధాన్యం కొనుగోళ్ల అంశం కొలిక్కి వచ్చేనా?

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.

అయితే వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రాష్ట్ర రాజకీయమంతా వరి ధాన్యం కొనుగోళ్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇటీవల నిర్వహించిన మహా ధర్నాతో కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో కెసీఆర్ ఢిల్లీ పయనమయ్యారు.తాజాగా దీనిపై కేంద్ర మంత్రులతో భేటీ అయి వరి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోరుతున్న పరిస్థితి ఉంది.

తాజాగా మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన విషయం తెలిసిందే.అయితే రెండు రోజుల్లో ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేస్తామనే విషయంపై స్పష్టత ఇస్తామని తెలిపారు.

అయితే ఇప్పటికే రైతులందరు దుక్కి దున్నడానికి సిద్దమవుతున్న తరుణంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాత్సారంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉంది.

Advertisement

అయితే ఢిల్లీ పర్యటన తరువాత కేంద్రం స్పందించిన విధానాన్ని బట్టి రైతులు ఎలాంటి పంటలు పండించాలి అనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు కెసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికిప్పుడు రైతులు ఇతర పంటల వైపు మారడం అనేది చాలా కష్టతరమైన విషయం.రైతులు మొదట రెండు నుండి మూడు సంవత్సరాలు ఎంతో కొంత నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే స్వయంగా ప్రభుత్వమే మారడం కష్టమని చెబుతున్న తరుణంలో రైతులు కొంత ఆలోచించి మాత్రమే యాసంగీ పంట పండించే ఆలోచనపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికైతే బీజేపీ మాత్రం ఇక రాజకీయం చేసే అవకాశం లేదు.

మరి రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వ ఆరుతడి పంటల సలహాను స్వీకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు