క్రెడిట్ కార్డు బిల్లు పెరిగిపోతుందా..? బిల్లును ఈజీగా కట్టండిలా..

కరోనా మహమ్మారి వల్ల ఆస్పత్రుల బిల్లులు, చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, అన్నీ స్తంభించిపోవడం వల్ల ఉపాధి దొరక్కపోవడం వల్ల చాలామంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

దీంతో కరోనా సమయంలో ఆర్ధిక సమస్య వల్ల చాలామంది క్రెడిట్ కార్డులు(Credit card ), లోన్లు వంటివి ఎక్కవగా తీసుకున్నారు.

డబ్బులు అత్యవసరమైన సమయంలో క్రెడిట్ కార్డు బాగా ఉపయోగపడతాయి.అలాగే క్రెడిట్ కార్డులపై అనేక ఆఫర్లు లభిస్తూ ఉంటాయి.

అందుకే వీటిని చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు తీసుకుంటూ ఉంటారు.

మన శాలరీ లేదా మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి క్రెడిట్ కార్డు లిమిట్ ను బ్యాంకులు ఫిక్స్ చేస్తాయి.అయితే చాలామంది క్రెడిట్ కార్డు ఉంది కదా అని గీకేస్తూ ఉంటారు.దీని వల్ల బిల్లు వచ్చేసరికి ఇబ్బంది పడుతుంది.

Advertisement

బిల్లు చెల్లించాల్సిన గడువు వచ్చేసరికి చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల చాలామంది చెల్లించరు.వచ్చే నెలలో చెల్లించవచ్చులే అని వదిలేస్తూ ఉంటారు.

దీని వల్ల లేటు ఫీజు, వడ్డీ బాగా ఎక్కువగా పడి కొండలా క్రెడిట్ కార్డు బిల్లు పెరిగిపోతూ ఉంటుంది.కానీ కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈజీగా క్రెడిట్ కార్డు బిల్లులను త్వరగా క్లియర్ చేయవచ్చు.

చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్లుపై ఈఎంఐ( EMI ) ఆప్షన్ కల్పిస్తున్నాయి.ఈఎంఐ సెలక్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చు.అలాగే ఫిక్స్ డ్ డిపాజిట్, పీపీఎఫ్ వంటి స్కీమ్‌ల నుంచి లోన్ తీసుకోని క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్( Fixed deposit ), పీపీఎఫ్ వంటి అకౌంట్లపై తక్కువ వడ్డీ ఉంటుంది.అక్కడ తీసుకుని క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ద్వారా కూడా డిఫరెంట్ క్రెడిట్ పీరియర్ రూపంలో అడ్వాంటేజ్ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు