హీరో పాత్ర చనిపోతే తెలుగు సినిమా ఆడుతుందా ? అందుకే రిపబ్లిక్ ఫలితం ఇలా ?

సినిమాలు ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రూపొందించబడతాయి.జనాలు కూడా వినోదం కోసమే థియేటర్స్‌కు వస్తుంటారు.

అయితే, అందరు మేకర్స్ వినోదాత్మక చిత్రాలు తీయరు.కొందరు సందేశాత్మక సినిమాలు తీస్తుంటారు.

తద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాలు ఇస్తుంటారు.కాగా, ట్రాజెడి ఎండింగ్‌ను ప్రేక్షకులు ఒప్పుకోరు.

అయితే, ఒకప్పుడు ఆనాటి హీరోల ట్రాజెడి సినిమాలను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు.అవి సూపర్ హిట్ అయ్యాయి కూడా.

Advertisement

అక్కినేని నాగేశ్వర్‌రావు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామరావు నటించిన చిత్రాలు దు:ఖాంతంతో ఎండ్ అయినా హిట్ అయ్యాయి.అయితే, అప్పటికి ఇప్పటికి తరం మారింది.

హీరోలు మారారు.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రజానీకం దు:ఖాంతం యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు.ఇటీవల కాలంలో చాలా మంది యంగ్ డైరెక్టర్స్, హీరోస్ అటువంటి విషాద ముగింపుతో సినిమాలు చేసి సక్సెస్ అయితే కాలేదు.

అప్పట్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రభాస్‌తో ‘చక్రం’ అనే చిత్రం తీశారు.అయితే, ఆ సినిమా చివర్లో ప్రభాస్ చనిపోతాడు.అలా హీరో చనిపోవడాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారని చాలా మంది అంటుంటారు.

టాలెంటెడ్ డైరెక్టర్ దేవ్ కట్టా డైరెక్షన్‌లో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రిపబ్లిక్’ ఫిల్మ్‌లో ఎండింగ్‌లో హీరో చనిపోతాడు.ఈ సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ దిశగా అయితే అంతగా కనపడటం లేదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

సందేశాత్మక చిత్రం అని పలువురు పేర్కొంటున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం యావరేజ్ టాక్‌నే సొంతం చేసుకుంది.

Advertisement

ఈ క్రమంలోనే సినిమా రిజల్ట్‌పై అంచనాలు తారు మారు అయ్యే చాన్సెస్ ఉన్నాయని పలువురు సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.మాస్ హీరోకు ట్రాజెడి ఎండింగ్ పెట్టి డైరెక్టర్ తప్పు చేశాడేమోనని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇకపోతే సినిమా ఫ్లాప్ దిశగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

కాగా, బైక్ యాక్సిడెంట్‌లో గాయపడిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రజెంట్ కోలుకుంటున్న సంగతి అందరికీ విదితమే.

తాజా వార్తలు