చైతన్య చెప్పిన మాట సమంత చెప్పగలదా.. అదే నిజమైతే ఎందుకిలా ఉన్నారంటూ?

చైతన్య, సమంత టాలీవుడ్ క్యూట్ కపుల్ కాగా పెళ్లి చేసుకుని కొన్నేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జోడీ ఇప్పుడు మాత్రం విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు.

చైతన్య సమంత విడిపోవడానికి రీజన్ ఇదేనంటూ వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వచ్చాయి.

ఆ ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాకపోయినా కొంతమేర అయినా నిజం కావచ్చని చాలామంది భావించడం జరిగింది.అయితే చైతన్య ( Naga Chaitanya ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత ( Samantha ) పేరును ప్రస్తావించడం, సమంత గురించి పాజిటివ్ గా స్పందించడం జరిగింది.

విడాకుల విషయంలో సమంత తప్పు ఏ మాత్రం లేదనే విధంగా చైతన్య స్పందించారు.అదే సమయంలో సమంత పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది.

మనమంతా ఒకటేనని కేవలం అహంకారాలు, భయాలు మాత్రమే దూరం చేస్తాయని సమంత కామెంట్లు చేశారు.

Advertisement

సమంత మాత్రం గతంలో ఒక సందర్భంలో చైతన్య గురించి ప్రస్తావిస్తూ నేను చైతన్య ఒకే గదిలో ఉంటే అక్కడ పదునైన కత్తులు, వస్తువులు ఉండకూడదని కామెంట్ చేశారు.చైతన్య సమంత గురించి చెప్పినంత పాజిటివ్ గా సమంత చైతన్య గురించి చెప్పగలదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.చైతన్య, సమంత మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించుకొని కలిసి ఉంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చైతన్య, సమంత ఒకే వేదికపై కనిపించడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నాగచైతన్య కస్టడీ( Custody Movie ) ట్రైలర్ తో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు.కస్టడీ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి.

ఈ ట్రైలర్ ఇంప్రెస్ చేసేలా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.చైతన్య, సమంత భవిష్యత్తులో కూడా కలిసి నటించే అవకాశం అయితే లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చైసామ్ కలిసి కనిపించి తమ మధ్య విభేదాల గురించి స్పష్టత ఇస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు