అలా జరిగితే ఆర్ఆర్ఆర్ బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా.. ఏమైందంటే?

వెండితెరపై ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటిగా నిలవగా ఈ సినిమా అక్టోబర్ నెల 21వ తేదీన జపాన్ లో రిలీజ్ కానుంది.

చిత్రయూనిట్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రస్తుతం జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో ఆర్ఆర్ఆర్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.జపాన్ లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఈ సినిమా విజయంతో జక్కన్న నెక్స్ట్ లెవెల్ ను వెళ్లారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా విడుదలై నాలుగు నెలలవుతున్నా ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఈ సినిమాను చైనాలో కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నారు.ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో చైనా ఒకటనే సంగతి తెలిసిందే.

Advertisement

చైనాలో విడుదలైన పలు ఇండియన్ సినిమాలు అక్కడ భారీగా కలెక్షన్లను సాధించాయి.ఆర్ఆర్ఆర్ కూడా చైనాలో విడుదలైతే ఈ సినిమా బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది.బాహుబలి2 ఫుల్ రన్ లో 1800 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆర్ఆర్ఆర్ చైనాలో కూడా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే సులువుగా 2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించే అవకాశం ఉంటుంది.రాబోయే రోజుల్లో ఆర్ఆర్ఆర్ ఈ రికార్డును సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు