తెలంగాణ బిజెపి లో ఆ పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వం పై ఎప్పుడూ తను వాదనను వినిపిస్తూ ఏదో ఒక అంశంతో వార్తల్లోనూ, వివాదాల్లోనూ ఉంటూ ఉంటారు గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్.కొంతకాలం క్రితం అభ్యంతర వ్యాఖ్యలు చేయడం, దానిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ కావడంతో పోలీసులు రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.చాలాకాలం పాటు ఆయన జైల్లోనే ఉన్నారు.ఇటీవల ఆయన బెయిల్ బయటకు వచ్చారు.తనకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , హిందుత్వం విషయంలో వెనక్కి తగ్గేది లేదని దూకుడుగానే ముందుకు వెళ్తానంటూ రాజాసింగ్ మొదటి నుంచి ప్రకటిస్తూనే వస్తున్నారు.అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి నుంచి ఆయనకు అంతంత సహకారం ఉన్నా.
రాజాసింగ్ మాత్రం గతంలో మాదిరిగానే తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల పోలీసులు నమోదు చేసిన పిడి యాక్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేయవద్దని, మూడు నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేయవద్దంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.దీంతో ఈ షరతులను తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి రాజాసింగ్ కు ఏర్పడింది.ప్రస్తుతానికి రాజాసింగ్ సైలెంట్ గానే ఉంటున్నా.రాబోయే ఎన్నికల నాటికి ఆయన మరింత స్పీడ్ పెంచుతారని, ఆయన సన్నిహితులు , రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు రాజాసింగ్ పై 101 కేసులు నమోదు అయ్యాయి.టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయన దూకుడు కు బ్రేకులు వేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది.

రాజాసింగ్ వల్ల సమాజంలో శాంతిభద్రత సమస్యలు తలెత్తుతున్నట్లు కోర్టులో ఇటీవల ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది.అయితే రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగాల కారణంగా బిజెపి ఇమేజ్ కు డామేజ్ అవుతుందని కారణంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.రానున్న రోజుల్లో ఆయనకు మరింత ప్రాధాన్యం ఇచ్చి, సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా బిజెపి అధిష్టానం కూడా సిద్ధమవుతోంది.రాజాసింగ్ వంటి నాయకులు బిజెపి వాదాన్ని భాగంగా జనాల్లోకి తీసుకువెళ్తారని, రాబోయే ఎన్నికల్లో హిందుత్వం అంశం ప్రధాని నిజంగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో బిజెపి ఆయనకు మరింత మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.