అన్నా చెల్లి, అక్క తమ్ముడు మధ్య సంబంధాలు చాలా భావోద్వేగంగా ఉంటాయి.ఎప్పుడూ గిల్లికజ్జాలు, తల్లిదండ్రులకు చాడీలు చెప్పడం, కొట్టుకోవడం వంటిని మనం చూస్తుంటాం.
అయితే ఎంత కొట్టుకున్నా తమ చెల్లిని ఎవరైనా ఏడిపిస్తే ఏ అన్నా ఊరుకోడు.అలాగే తమ సోదరులను అక్క, చెల్లెలు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు.
వారి మధ్య అనుబంధాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతోంది.
చెల్లెలికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అన్న ఆమెను సర్ ప్రైజ్ చేశాడు.చెల్లెలి కళ్లలో ఆనందం చూసి సంతోషించాడు.
ఇక అన్న ఇచ్చిన గిఫ్ట్ కు ఆశ్చర్యపోయిన ఆ యువతి సంతోషంలో ఆనంద భాష్పాలు విడిచింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఐశ్వర్య అనే యువతి తన సోదరుడు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ తెరవడంతో ప్రారంభం అవుతుంది.ఆ బాక్స్ లోపల ఏముందోనని చాలా ఆసక్తిగా తెరుస్తుంది.తెరవడంతోనే దాని లోపల ఉన్నది చూసి ఆశ్చర్యపోతుంది.అందులో ఒక బైక్ కీ ఉండడం చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది.తన సోదరుడు తనకు స్కూటీ ఇచ్చాడని తెలుసుకున్న ఆమె సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంది.అతనిని కౌగిలించుకుంది.
ఇది చాలా హృద్యంగా ఉంది.తనకు స్కూటీ ఇచ్చిన సోదరుడిని కౌగలించుకుని థాంక్స్ చెబుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో అక్టోబర్ 30న పోస్ట్ చేయబడింది.షేర్ చేయబడినప్పటి నుండి, క్లిప్ దాదాపు 9.7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.ఇది మరింత పెరుగుతూ పోతోంది.వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.తమ జీవితంలోనూ తోబుట్టువులతో కొన్ని మధుర అనుభవాలను కామెంట్ల రూపంలో షేర్ చేస్తున్నారు.







