హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్న 'బిజినెస్ మ్యాన్' రీ రిలీజ్ టికెట్స్..ఖుషి రికార్డ్స్ బద్దలవ్వబోతుందా..?

టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టిందే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఫ్యాన్స్ అని అందరికీ తెలిసిందే.

గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన పోకిరి సినిమాని 4K కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.

ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సుమారుగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది.

ఆ తర్వాత పక్క నెలలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులు జల్సా సినిమాతో డబుల్ మార్జిన్ తో పోకిరి కలెక్షన్స్ ని అధిగమించారు.ఆ తర్వాత చాలా సినిమాలే విడుదల అయ్యాయి కానీ ఒక్కటి కూడా ఈ రెండు సినిమాల రేంజ్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి.

కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ఖుషి ని రీ రిలీజ్ చేసారు.

Advertisement

ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంత ఇంతా కాదు.ఇప్పుడే కాదు, ఎప్పటికీ అందుకోలేని అరుదైన రికార్డుని నెలకొల్పింది.మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.

ఈ సినిమా రికార్డ్స్ ని అందుకోవడానికి చాలా మంది హీరోలే ట్రై చేసారు కానీ విఫలం అయ్యారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నెల రోజుల ముందు నుండే భారీ ప్రొమోషన్స్ చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సీలెబ్రిటీస్ ని కూడా పిలిపించి మాట్లాడారు.

కానీ ఖుషి రికార్డు ని( Khusi Movie ) బద్దలు కొట్టలేకపోయారు.ఫుల్ రన్ సంగతి పక్కన పెడితే మొదటి రోజు దగ్గర్లోకి వచ్చి ఆగిపోయారు .ఇప్పుడు మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు 9 వ తేదీ దగ్గరకి వచ్చేస్తుంది.అభిమానులు బిజినెస్ మ్యాన్( Business Man Movie ) చిత్రాన్ని 4K కి మార్చి గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభించగా టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి, ఎప్పుడు టికెట్స్ అయిపోతున్నాయి అనేది ఫ్యాన్స్ కి కూడా అంతు చిక్కడం లేదు.అంత స్పీడ్ గా ఉంది ట్రెండ్.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఊపు చూస్తూ ఉంటే ఈ చిత్రం కచ్చితంగా ఖుషి మొదటి రోజు రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ఖాయం అనే అనిపిస్తుంది.నైజాం ప్రాంతం లో ఖుషి చిత్రానికి మొదటి రోజు కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Advertisement

దీనిని మహేష్ బిజినెస్ మ్యాన్ చిత్రం అధిగమిస్తుందని అంటున్నారు.చూడాలి మరి.

తాజా వార్తలు