ఆ విషయంలో చైనాను అధిగమించిన భారత్, భవిష్యత్తులో సూపర్ పవర్‌గా మారనుందా?

ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ గెలుచుకున్న స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకెల్ స్పెన్స్ 2001లో ఏ ముహూర్తాన భారత్( India ) శకం మొదలైందని చెప్పాడోగాని, అక్కడినుండి అంచెలంచెలుగా భారత్ దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పుకోవచ్చు.

ఇక తాజాగా భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిన సంగతి విదితమే.

ఈ విషయంలో ఏకంగా చైనానే అధిగమించింది భారత్‌.ఆర్థిక పరిమాణం, రాజకీయ ప్రాబల్యం, సైనిక శక్తిలో ప్రస్తుతానికి చైనా ముందంజలో ఉన్నప్పటికీ పరిస్థితులు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ప్రస్తుతం కొనసాగుతోంది.భారత్‌తో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ( Economic system ) 5 రెట్లు పెద్దది.ఈ విషయంలో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఇక చైనా తరహాలో దూసుకువెళ్లాలంటే ముఖ్యంగా భారత్‌లో విద్య, జీవన ప్రమాణాలు, ఆర్థిక సంస్కరణల్లో భారీగా పెట్టుబడులు అనేవి చాలా అవసరం.ఇక్కడ ప్రస్తుతం సూపర్‌ పవర్ అంటే జనాభానే.

Advertisement

భౌగోళిక-రాజకీయ అంశాలు, సైనిక శక్తి( Indian Army ) లాంటి వాటిని కూడా ఇక్కడ విశ్లేషిస్తే వీటిలో భారత్ చాలా వెనుకబడి ఉందనేది నిర్వివాదాంశం.

ఇక ఇక్కడ సాఫ్ట్‌ పవర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.ఉదాహరణకు టాలీవుడ్ (తెలుగు సినిమా పరిశ్రమ) భారత్‌ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోంది.నెట్‌ఫ్లిక్స్‌లో అయితే భారత్ సినిమాలు కొత్తరికార్డులు సృష్టిస్తున్నాయి.

తొలిసారిగా 2020లో బాక్సాఫీస్ కలెక్షన్లలో హాలీవుడ్‌ను దాటుకుని ముందుకు వెళ్లింది ఇండియన్ సినిమా పరిశ్రమ.అదేవిధంగా మిగతా పరిశ్రమలలో కూడా నేడు భారత్ పురోగతి సాధిస్తుందని అంటున్నారు.

భారత్‌లో పనిచేసే వారి సంఖ్య పెరగడంతో, ఆర్థిక వృద్ధికి కూడా ఇక్కడ లోటులేదని తెలుస్తోంది.ఈ క్రమంలో భారత్ భవిష్యత్తులో సూపర్ పవర్‌గా ఎదగనుందని విశ్లేషకులు మాట.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు