తెలంగాణలో కాంగ్రెస్( Congress Party ) అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలే.( Six Guarantees ) వాటిని 100 రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది.
ఇప్పటికే రెండు హామీలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది.అయితే ఈ ఆరు హామీలే కాకుండా కాంగ్రెస్ ప్రకటించిన చాలా హామీలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.మెగా డిఎస్సీ, బీసీ డిక్లరేషన్ లోని అంశాలు, మైనారిటీలకు ప్రదాన్యత, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1200.ఇలా ఎన్నికల ముందు చాలా హానీలనే కాంగ్రెస్ ప్రకటించింది.అయితే వీటిపై కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ప్రత్యర్థి పార్టీనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ ఆరు హామీలనే ప్రస్తావిస్తోందని ఆ పార్టీ ఎన్నికల ముందు 412 కు పైగా హామీలు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి( Alleti Maheshwar Reddy ) ఇటీవల వ్యాఖ్యానించ్చారు.ఇక తాజాగా జరిగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్( KTR ) కూడా కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై గట్టిగానే ప్రశ్నలు గుప్పించారు.మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మెగా డీఎస్సీ మరియు ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత, రైతుఋణ మాఫీ, కౌలు రైతులకు భీమా, బీసీలకు సబ్ ప్లాన్ ఎంబిసి మంత్రుత్వ శాఖ, వెనకబడిన తరగతుల వారికి స్పెషల్ మినిస్ట్రీ, మైనారిటీలకు సబ్ ప్లాన్, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1200, ఇలా చాలా హామీలనే కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించింది.
వాటి అమలు విషయంలో కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.ఈ నేపథ్యంలో ఇంతవరకు కేవలం ఆరు గ్యారెంటీ హామీలనే ప్రస్తావిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మిగతా హామీలు కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ప్రస్తుతం రాష్ట్రంలో అప్పుల భారం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆరు గ్యారెంటీలతో పాటు మిగిలిన హామీలను అమలు చేయడం అంతా తేలికైన విషయం కాదు.మొత్తానికి కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సర్కార్ కు అగ్ని పరిక్షే ని రాజకీయ వాదులు అభిప్రాయ పడుతున్నారు.