స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajayya) వ్యవహారం రోజు రోజుకి ముదురుతుంది.ఇప్పటికే ఒకసారి హనీ ట్రాప్ వలలో పడి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి పోగొట్టుకున్న రాజయ్య వ్యవహార శైలి ఏమాత్రం మారలేదని ఇటీవల జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
వరంగల్ జిల్లా జానకిపురం సర్పంచ్ శ్రీమతి నవ్య(Sarpanch Navya) తనతో ఎమ్మెల్యే రాజయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వేరే నాయకులతో ఫోన్ మాట్లాడించి ఒంటరిగా ఆయన ఇంటికి వెళ్లాలని, షాపింగ్ కి వెళ్లాలని చెప్పిస్తున్నారని తండ్రిలా భావిస్తున్నానని చెప్పినా కూడా వినకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారని మీడియా ముందుకు వచ్చి కాల్ రికార్డింగ్ లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై సీరియస్ అయిన మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది.
మామూలుగా అయితే ఈ సంఘటన ఎలా ముగిసిపోయేదో తెలియదు కానీ ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన నడుస్తున్న కోల్డ్ వార్ వల్ల ఈ విషయం రాజకీయ మలుపు తీసుకోబోతున్నట్లుగా అర్థమవుతుంది.ఇప్పటికే కవిత (MLC Kavitha) వ్యవహారంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ కేంద్రంపై పోరు సాగిస్తున్న బారసా పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేసేటట్టుగారాజయ్య వ్యవహారం తయారయింది.

ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సాధ్యమయినంత పెద్దది చేసి బారాసకి కోలుకోలేని జలక్ ఇవ్వాలని రాష్ట్ర బిజెపి పార్టీ నిర్ణయించుకుంది.ఈ వ్యవహారాన్ని ఇప్పటికే పసికట్టిన రాష్ట్ర ప్రభుత్వం రాజయ్య చేత క్షమాపణలు చెప్పించడమే కాక ఆ సర్పంచ్ ఇంటికి పంపించి ఇద్దరికీ మధ్య సయోద్య కూడా కుదిర్చినట్టు సమాచారం.సర్పంచ్ ఇంటికి వెళ్లిన రాజయ్య అక్కడ మీడియాతో మాట్లాడుతూ జరిగిన పరిణామాలు బాధాకరమైనవని దానికి చింతిస్తున్నానని

రాష్ట్ర ప్రభుత్వం సూచనలు సర్పంచ్ భర్త ఆహ్వాన మేరకు ఇక్కడికి వచ్చానని, జరిగిన విషయాలు అందరం మర్చిపోయి గ్రామ అభివృద్ధికి పాటు పడదామని తెలిపారు.ఈ విషయాన్ని ఇక్కడితో ముగిద్దాం అని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుండగా దొరికిన అవకాశాన్ని ఎందుకు వదిలి పెట్టాలని భాజపా భావిస్తున్నట్లుగా తేలుతుంది మరి ముందు ముందు ఈ విషయం తిరగబోతుందో చూడాలి
.






