తెలంగాణలో ఈసారి అధికారం సాధించేది మేమే అని కమలనాధులు బల్లగుద్ది గ ఈ మాట చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి చూస్తే దీనికి భిన్నంగా ఉందంటున్నారు.నిజానికి అధికారంలోకి వస్తుంది అని అంచనాలున్న పార్టీలోకి వలసలు ఎక్కువగానే ఉంటాయి.
రాజకీయ నాయకులు తమ సొంత లెక్కలేసుకుంటూ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాల ప్రకారం ఆ పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ లెక్కన చూసిన గత కొన్ని నెలలుగా బిజెపి లోకి వచ్చిన కీలక నాయకులు ఎవరూ లేరు.నిజానికి ఆ పార్టీకి యాభై స్థానాల్లో కూడా గెలిచే అభ్యర్థులు దొరకడం లేదన్నది పార్టీ వర్గాల అంతర్గత విశ్లేషణ.
బాజాపా తో పోలిస్తే కాంగ్రెస్సే ముందు ఉందని చెప్పాలి.తెలంగాణలో కాంగ్రెస్(congress) సాంప్రదాయక ప్రతిపక్షంగా కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతుంది.
దాని పని అయిపోయిందని ఎంత మంది ప్రచారం చేసినా కూడా ఇప్పటికీ తెలంగాణలో ప్రధానప్రతిపక్ష హోదా కాంగ్రెస్ దే.ఒకపక్క అమిత్ షా(Amit Shah) తరచూ రాష్ట్ర పర్యటన చేస్తూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్న కూడా పార్టీలోకి వలసలను తీసుకురావడంలో రాష్ట్ర బిజెపి నాయకత్వం విఫలమవుతుందా లేక నాయకుల్లో పార్టీపై నమ్మకం లేక వలసలు రావడం లేదా అన్నది తెలియాల్సి ఉంటుంది.

ఈటెల రాజేందర్ (Etela Rajender)ఆధ్వర్యంలో చేరికలపై కమిటీ వేసినా కూడా ఫలితం మాత్రం శూన్యం.ఇదే విషయంపై ఇటీవల జరిగిన మీటింగ్లో అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి అక్షo తలు వేసినట్టుగా తెలుస్తుంది.నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో ప్రధానంగా చేరికల గురించి చర్చించినట్లు సమాచారం.రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి పార్టీలోకి చేర్చుకోవాలని ,ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు చేరికలు జరగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.
ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున కనీసం 500 నియోజకవర్గాలలో గెలిచే అభ్యర్థులను గుర్తించాలని ఆయన రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తుంది… ఒకవైపు అధికారం మాదే అంటున్నాను బాజాపా మరొకవైపు అభ్యర్థుల్ని వెతుక్కోవలసిన పరిస్థితి పేపర్ పై తప్ప గ్రౌండ్ డబుల్ లోపా పార్టీ పరిస్తికి అద్దం పడుతుంది
.






